టీడీపీ భవిష్యత్ రథసారథి నారా లోకేశ్‌ను మహమ్మారి ముద్దాడింది. తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు ఆయన ప్రకటించారు. గత రెండు వేవ్‌లలో ఎప్పుడూ ఆయన కరోనా బారిన పడలేదు. చాలా మంది సామాన్య జనంతో పాటు సినీ, రాజకీయ సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు మృత్యువుతో పోరాడి విజేతలుగా నిలిచారు.
ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్‌ను చుట్టేస్తున్న తరుణంలో పలువురు ప్రముఖులు మహమ్మారి బారిన పడడం చూస్తున్నాం. ఈ తరుణంలో తాను కూడా కోవిడ్‌కు గురైనట్టు నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఆయన ప్రకటనలో ఏమున్నదంటే…
‘నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నాకు కరోనా లక్షణాలేమీ లేవు. అలాగే బాగానే ఉన్నాను. కానీ నేను కోలుకునే వరకూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటాను. నన్ను కలిసిన వారంతా వెంటనే టెస్టులు చేయించుకుని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరినీ సేఫ్‌గా ఉండాలని అర్థిస్తున్నాను’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
లక్షణాలేవీ లేకుండానే లోకేశ్ కరోనాకు గురి కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. లోకేశ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం.