రాహుల్ గాంధీకి బెయిల్!

ప‌రువు న‌ష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూర‌త్ సెష‌న్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త‌న‌కు విధించిన రెండేళ్ల జైలు శిక్ష‌ను ర‌ద్దు…

ప‌రువు న‌ష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూర‌త్ సెష‌న్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త‌న‌కు విధించిన రెండేళ్ల జైలు శిక్ష‌ను ర‌ద్దు చేయాల‌ని రాహుల్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై త‌దుప‌రి విచార‌ణ‌కు ఈ నెల 13కు వాయిదా వేసింది. దీంతో ఆయ‌న పార్ల‌మెంట్ స‌భ్య‌త్వంపై విధించిన స‌స్పెష‌న్ కొన‌సాగనుంది.

కాగా 2019 కర్ణాటకలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ.. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై గుజరాత్‌కు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ సూరత్‌ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. పలుమార్లు విచారణ జరిపిన కోర్టు.. దోషిగా నిర్ధారిస్తూ మార్చి 23న రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

కోర్టు శిక్ష విధించిన 24 గంటలలోనే రాహుల్ పార్లమెంటు సభ్యత్వంపై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. తనపై జీవితకాలం అనర్హత వేటు వేసినా మోదీ-అదానీలపై సంబంధంపై సమాధానం వచ్చే వరకూ ప్రశ్నిస్తూనే ఉంటానని రాహుల్ గాంధీ చెప్పిన విష‌యం తెలిసిందే.