కరోనా కారణంగా టాలీవుడ్ దాదాపు కొన్ని నెలల పాటు స్తంభించిపోయింది. ఈ టైమ్ లో రాజమౌళి, కీరవాణి ఇలా కొంత మందికి కరోనా సోకింది. నిజానికి ఇంకా చాలా మంది కి సోకింది.
కానీ ఎవ్వరూ వచ్చిందని బయటకు చెప్పుకోలేదు. ఎస్పీబీ లాంటి వారిని కరోనా మనకు దూరం చేసింది. రాజశేఖర్ లాంటి వారు కరోనాతో పోరాడి జయించారు.
కరోనా తగ్గుముఖం పట్టింది అని చకచకా సినిమాల షూట్ లు ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ ఆరంభంలో మెల్లగా ప్రారంభమైన షూటింగ్ లు, సందడులు నవంబర్ మొదటి వారానికి పతాక స్థాయికి చేరాయి.
ఇక థియేటర్లు పూర్తిగా ప్రారంభం అయితే చాలు టాలీవుడ్ మళ్లీ మామూలు అయినట్లే అని అందరూ అనుకుంటున్నవేళ 'మెగా' బాంబ్ పేలింది.
తనకు కరోనా పాజిటివ్ అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయడం టాలీవుడ్ ను ఉలిక్కిపడేలా చేసింది. మళ్లీ షూటింగ్, సందడులు ఎక్కడ ఆగుతాయో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే విధంగా ఆయన ఆచార్య సినిమాకు మళ్లీ బ్రేక్ పడిపోయింది.
ఏ లక్షణాలు లేని కరోనా కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు కానీ, మళ్లీ మెగాస్టార్ సెట్ మీదకు రావడానికి ఎలా లేదన్నా ఓ నెల రోజులు పట్టే అవకాశం వుంది. లేదూ ఏమాత్రం విశ్రాంతి తీసుకోవాలని మెగాస్టార్ అనుకున్నా, మరోనెల డేకేస్తుంది.
మొత్తం మీద ఆచార్య సినిమా 2021 సమ్మర్ కు కూడా వస్తుందా? రాదా? అన్న అనుమానాలు ఇప్పుడు వినిపించడం ప్రారంభమయ్యాయి. ఎందుకంటే ఓ భారీ సినిమా షూటింగ్ ఎంత చకచకా చేసినా కనీసం ఆరునెలలు పడుతుంది కదా? జనవరిలో ప్రారంభమైతే ఓకె. లేదూ అంటే ఇక 2021 దసరా బరికే గురిపెట్టాలేమో?