నాగ్ పట్టుదలే నెగ్గింది

మూడు నెలల సమయం. ఏ ఒక్క టెక్నీషియన్ పగలు, రాత్రి కూడా విశ్రాంతి తీసుకోకుండా కష్టపడ్డ వైనం. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి కి విడుదల చేసి తీరాల్సిందే నిర్మాత కమ్ హీరో నాగార్జున పట్టు…

మూడు నెలల సమయం. ఏ ఒక్క టెక్నీషియన్ పగలు, రాత్రి కూడా విశ్రాంతి తీసుకోకుండా కష్టపడ్డ వైనం. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి కి విడుదల చేసి తీరాల్సిందే నిర్మాత కమ్ హీరో నాగార్జున పట్టు పట్టారు. 

డైరక్టర్ కు, మ్యూజిక్ డైరక్టర్ కి నిద్రలేని రాత్రులే. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు వరకు టెన్షనే టెన్షన్. 

అయితే చేతిలో అన్నపూర్ణ స్టూడియో వుంది కనుక చాలా వరకు పని సులువు అయింది. మొత్తం మీద సినిమా విడుదలయింది. పండగకు బంగార్రాజు మాత్రమే సినిమా అయిపోయింది.దాంతో ఇప్పడు కలెక్షన్లు కుమ్మతున్నాయి. తొలి రోజు కన్నా మలి రోజు మరింత మంచి కలెక్షన్లు కనిపించాయి.

నైజాంలో గత రెండేళ్లుగా సంక్రాంతి కన్నా పండగ వెళ్లాక కలెక్షన్లు బాగుంటున్నాయి. అదే ఆశతో వున్నారు. ఆంధ్రలో ప్రస్తుతం మళ్లీ ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేసింది. దాంతో మూడు వంతుల చోట్ల మళ్లీ పాత రేట్లు అమ్మేస్తున్నారు. 

మొత్తం మీద నాగ్ అంచనా ప్రకారం ఆంధ్రలో బంగార్రాజు పక్కా పండగ సినిమగా మారిపోయింది.