విజయసాయిరెడ్డి పట్టువదలని విక్రమార్కుడు. ఆయన అనుకున్నది సాధిస్తారు. విశాఖలోని గీతం విద్యా సంస్థల విషయానికి వస్తే విజయసాయిరెడ్డి మొత్తం కూపీ లాగుతున్నారు. గుట్టు మొత్తం తవ్వి తీస్తున్నారు.
దాంతో గీతం సంస్థల వెనక ఇంత కధ ఉందా అని విశాఖ వాసులే ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా విజయసాయిరెడ్డి గీతం సంస్థలు చేస్తున్న అనేక ఉల్లంఘనల గురించి సంబంధిత కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేశారు.
మెడికల్ కళాశాల విషయంలో జాతీయ వైద్య మండలికి ఆయన లేఖ రాసి చర్యలు తీసుకోవాలని కోరారు.అదే సమయంలో ఇపుడు గీతంలో ఫార్మసీ కోర్సుల విషయంలోనూ నిబంధలను పాటించడంలేదని ఫిర్యాదు చేశారు.
నిజానికి గీతం ప్రభుత్వ భూములను అక్రమంగా తీసుకుంది అన్నదే ఇంతదాకా ఆరోపణగా ఉంది. ఇపుడు విజయసాయిరెడ్డి చేస్తున్న ఫిర్యాదులతో యూజీసీ నిబంధలను కూడా పాటించలేదా అన్న డౌట్లు వస్తున్నాయి.
మొత్తానికి భూముల కధ కాదు కానీ తవ్విన కొద్దీ కొత్త విషయాలు గీతం నుంచి బయటకు వస్తున్నాయని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు మరెన్ని విషయాలు విజయసాయిరెడ్డి బయటకు లాగుతారో.