చంద్రబాబు దగ్గర కోచింగ్ తీసుకున్న ట్రంప్

“నేనే గెలిచాను. భారీ మెజారిటీ సాధించాను”. తాజాగా ట్రంప్ పెట్టిన ట్వీట్ ఇది. ఓవైపు ఓటమి తప్పదని తేలినప్పటికీ ట్రంప్ పెట్టిన ఈ ట్వీట్ చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.కొంతమంది సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇక…

“నేనే గెలిచాను. భారీ మెజారిటీ సాధించాను”. తాజాగా ట్రంప్ పెట్టిన ట్వీట్ ఇది. ఓవైపు ఓటమి తప్పదని తేలినప్పటికీ ట్రంప్ పెట్టిన ఈ ట్వీట్ చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.కొంతమంది సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. నేనే గెలిచానంటూ ట్రంప్ పెట్టిన ట్వీట్ చూసి జనాలు మరోసారి చంద్రబాబును గుర్తుతెచ్చుకుంటున్నారు.

దాదాపు ఏడాదిన్నర కిందటి విషయం.. ఎన్నికల ఫలితాలకు ముందు చంద్రబాబు వీరంగం చాలామందికి గుర్తుండే ఉంటుంది. కౌంటింగ్ తో సంబంధం లేకుండా, తనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటూ ఏకపక్షంగా ప్రకటించుకున్నారు బాబు. 

అక్కడితో ఆగలేదాయన. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టారు. అవే మీటింగ్స్ లో సస్పెండ్ చేస్తా జాగ్రత్త అంటూ కళ్లు పెద్దవి చేసి కొందరు అధికారుల్ని ఆయన హెచ్చరించిన వైనం కూడా చాలామందికి గుర్తు.

ఇప్పుడు ట్రంప్ ట్వీట్ చూసి, చాలామంది అప్పట్లో బాబు చేసిన ఓవరాక్షన్ ను గుర్తుచేసుకుంటున్నారు. అన్నీ తానే కనిబెట్టానని, ఎంతోమందికి లైఫ్ ఇచ్చానని చెప్పుకునే చంద్రబాబు.. బహుశా ట్రంప్ కు కూడా ఈ విషయంలో కోచింగ్ ఇచ్చి ఉంటారని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ట్రంప్ తన శిష్యుడేనని బాబు చెప్పుకునే సమయం ఇదేనంటూ సెటైర్లు వేస్తున్నారు కొంతమంది.

మరోవైపు బాబుతో పోలిక పెట్టే మరో సందర్భాన్ని కూడా ట్రంప్ స్వయంగా సృష్టించారు. తమ పార్టీ పరిశీలకుల్ని కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించడం లేదని ట్రంప్ ఆరోపించారు. దీనికితోడు 71,000,000 లీగల్ ఓట్లు సాధించానని, పదవిలో ఉండి రెండోసారి పోటీచేసిన ఏ అధ్యక్షుడికి ఈ స్థాయిలో ఓట్లు రాలేదని గొప్పలు చెప్పుకున్నారు.

అటు బాబు కూడా దాదాపు ఇదే పని చేశారు. తను ఓడిపోయే దశకు చేరుకున్న టైమ్ లో నెపాన్ని ఈవీఏంలపై నెట్టారు. తనను ప్రజలు ఓడించలేదని, ఈవీఏంలు ఓడించాయని కలరింగ్ ఇచ్చారు. తమ పార్టీ పరిశీలకుల్ని కూడా కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదన్నారు. ట్రంప్ ఎలాగైతే లీగల్ ఓట్లను హైలెట్ చేశారో, గతంలో బాబు కూడా తన పార్టీకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజీని హైలెట్ చేసుకున్నారు.

వీటన్నింటినీ కంపేర్ చేస్తూ.. బాబు-ట్రంప్ లపై తెగ జోకులు పేలుతున్నాయి. కచ్చితంగా ఈ లాక్ డౌన్ టైమ్ లో జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు, ట్రంప్ కు కోచింగ్ ఇచ్చి ఉంటారని సెటైర్లు పడుతున్నాయి. రేపోమాపో జూమ్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ బాబు, ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అక్కడున్నది “40 ఇయర్స్ ఇండస్ట్రీ” మరి.

ఈ పలుకులకు పరమార్థం లేదు, ప్రయోజనం లేదు