టీడీపీ అక్కడో మాట…ఇక్కడో మాట.

తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా చెప్పుకుంటారు. అలాంటి పార్టీలో కీలక అంశాల మీద ఇంత అయోమయమా అన్నదే ఇపుడు డౌట్ గా ఉంది. ఏపీలో ఉన్న బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలంటూ…

తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా చెప్పుకుంటారు. అలాంటి పార్టీలో కీలక అంశాల మీద ఇంత అయోమయమా అన్నదే ఇపుడు డౌట్ గా ఉంది. ఏపీలో ఉన్న బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యన జరిగిన బడ్జెట్ సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించింది.

దీని మీద గిరిజనులు మండిపోతున్నారు. ఏడు శాతం ఉన్న తమ రిజర్వేషనల్లో నలభై లక్షలకు పీగా ఉన్న బోయ, వాల్మీకి కులస్తులు చేరితే తమ ప్రయోజనాలు దెబ్బ తింటాయని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు  ఏపీలోని మన్యం జిల్లాల బంద్ ని ఈ రోజు గిరిజన సంఘాలు నిర్వహించారు. ఈ బంద్ కి వైసీపీ మినహా అఖిలపక్ష రాజకీయ నాయకత్వం మద్దతు ఇచ్చింది. మిగిలిన పార్టీలను పక్కన పెడితే తెలుగుదేశం మద్దతు ఇవ్వడమే చిత్రంగా ఉందని అంటున్నారు.

ప్రస్తుతం రాయలసీమలోని అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ వాల్మీకి బోయ కులస్తులు ఎస్టీ జాబితాలో కలిపేందుకు తమ ప్రభుత్వం వస్తే కృషి చేస్తుందని హామీ ఇస్తున్నారు. అక్కడ ఆయన అలా మాట్లాడితే మన్యం ప్రాంతంలో మాత్రం తెలుగుదేశం పార్టీ వారు వైసీపీ ప్రభుత్వం గద్దే దిగాలని ఎమ్మెల్యే, ఎంపీలు రాజీనామా చేయలని డిమాండ్ చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీకి ఈ విషయంలో ఉన్న స్టాండ్ ఏంటి అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు మీ పార్టీ వాల్మీకి బోయలను ఎస్టీలలో చేర్చకూడదని అనుకుంటే ఆ మాట చెప్పాలి కదా. రాయలసీమ జిల్లాలలో వారి సంఖ్య ఎక్కువగా ఉన్న చోట ఆ హామీ ఇస్తున్నారని,మన్యంలో మాత్రం వద్దు అంటున్న గిరిజనలతో కలసి ఉద్యమిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

రాజకీయ ప్రయోజనం కోసం ఇలా చేయడం తెలుగుదేశానికే చెల్లింది అని అంటున్నారు. సీమ జిల్లాలలో కొన్ని నియోజకవర్గాలలో బోయ వాల్మీకి ఓట్లు కీలకం కాబట్టి ఆ పార్టీ నాయకులు వారిని ఎస్టీలలో చేరుతామని అంటున్నారని నిజానికి టీడీపీకి చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నిస్తున్నారు. దీని మీద టీడీపీ నేతలే క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.