ఆంటీతో బ్రేక‌ప్పా.. రూమ‌ర్లే అంటున్న హీరో!

బోనీ క‌పూర్ త‌న‌యుడు అర్జున్ క‌పూర్ వ‌య‌సును బ‌ట్టి మ‌లైకా అరోరా వ‌య‌సును చూస్తే.. అత‌డికి ఆమె ఆంటీ కావ‌డంలో పెద్ద విచిత్రం లేదు. అయితే వీరిద్ద‌రూ ప్రేమికుల‌య్యారు. త‌న క‌న్నా పుష్క‌ర‌కాలం పెద్ద‌దైన…

బోనీ క‌పూర్ త‌న‌యుడు అర్జున్ క‌పూర్ వ‌య‌సును బ‌ట్టి మ‌లైకా అరోరా వ‌య‌సును చూస్తే.. అత‌డికి ఆమె ఆంటీ కావ‌డంలో పెద్ద విచిత్రం లేదు. అయితే వీరిద్ద‌రూ ప్రేమికుల‌య్యారు. త‌న క‌న్నా పుష్క‌ర‌కాలం పెద్ద‌దైన మలైకాతో అర్జున్ క‌పూర్ గ‌త కొన్నేళ్లుగా ప్రేమాయ‌ణ‌మో, స‌హ‌జీవ‌న‌మో ఏదో సాగిస్తూ ఉన్నాడు. అర్జున్ క‌పూర్ వ‌ల్ల‌నే మ‌లైక త‌న మొద‌టి భ‌ర్త‌కు విడాకులు ఇచ్చింద‌నే ప్ర‌చార‌మూ జ‌రిగింది.

ఏదేమైనా, ఎవ‌రేమ‌నుకున్నా.. అర్జున్, మ‌లైకాలు ప్రేమ‌ప‌క్షుల్లా విహ‌రిస్తూ ఉన్నారు. పెళ్లి పెటాకులై, పిల్ల‌లున్న మ‌లైకాతో అర్జున్ క‌పూర్ త‌ర‌చూ మాల్దీవుల ప‌ర్య‌ట‌న‌ను కూడా చేప‌డుతూ ఉంటాడు. అయితే ఇంత‌లో.. ఒక రూమ‌ర్ వ‌చ్చింది. వీరిద్ద‌రికీ బ్రేక‌ప్ అంటూ కొన్ని క‌థ‌నాలు వ‌చ్చాయి.

మ‌రి ఈ వ‌య‌సులో త‌న‌క‌న్నా ప‌న్నెండేళ్ల చిన్న కుర్రాడిని వ‌దులుకుంటే మ‌లైకాకు మ‌ళ్లీ అలాంటోడు దొరుకుతాడా, ఇక 48 యేళ్ల వ‌య‌సులో ఉన్న మ‌గువ‌తో ఇంత గాఢ‌మైన బంధాన్ని గ‌డిపిన అర్జున్ క‌పూర్ మ‌ళ్లీ యుక్త వ‌య‌సులోని అమ్మాయిలు చూస్తారా? అంటూ కొన్ని గ‌డుసు కామెంట్లూ త‌ప్పేవి కావేమో! మ‌రి వాటికి అవ‌కాశం ఇవ్వ‌కుండా.. త‌మ బ్రేక‌ప్ ఒట్టి రూమ‌ర్ అని తేల్చాడు అర్జున్ క‌పూర్.

మామూలుగా రూమ‌ర్ల‌ను సెల‌బ్రిటీలు లైట్ తీసుకుంటారు. బ్రేక‌ప్ రూమ‌ర్ల‌పై అయితే మ‌రీ లేటుగా స్పందిస్తారు. అయితే అర్జున్ క‌పూర్ మాత్రం లేటు చేయ‌కుండా.. అవ‌న్నీ గాసిప్స్ అని, త‌మ బంధం గాఢ‌మైన‌ది అని క్లారిటీ ఇచ్చేందుకు పోస్టును సైతం పెట్టేశాడు. మ‌రీ ఇంత వేగంగా ఇత‌డు స్పందించ‌డాన్ని బ‌ట్టి వీరి ప్రేమాయ‌ణం ఎంత గాఢ‌మైన‌దో అర్థం చేసుకోవాలి కాబోలు.