బన్నీ-త్రివిక్రమ్ కాంబో అల వైకుంఠపురములో సినిమా వ్యవహారం తేలిపోయింది. బ్లాక్ బస్టర్ రిజల్ట్ వచ్చేసింది. అజ్ఞాతవాసితో పోయిందనుకున్న ఇమేజ్ కు పదింతలు తెచ్చేసుకున్నారు త్రివిక్రమ్. ఇప్పుడు తరువాత సినిమాకు కూడా చకచకా రెడీ అయిపోతున్నారు.
హారిక హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ రూపొందించే సినిమా ప్రకటన ఈ నెలలోనే అధికారికంగా వెలువడనుంది. బహుశా మాఘమాసం రాగానే ప్రకటన రావచ్చు. ఈసారి ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేయబోతున్నారు. యాక్షన్ సీక్వెన్స్ లు వుండకపోవచ్చు. వున్నా కూడా లైట్ గా డిఫరెంట్ గా వుంటాయి తప్ప, 'కత్తులు లేవా..మంది లేరా' అనే రేంజ్ లో వుండవట.
గతంలో జంధ్యాల నుంచి వచ్చిన ఫ్యామిలీ కామెడీ సినిమాల మాదిరిగా పక్కా ఎంటర్ టైన్ మెంట్ లైన్ ను త్రివిక్రమ్ రెడీ చేసారు. అది స్క్రిప్ట్ గా మార్చాల్సి మాత్రం వుంది. ఏప్రియల్ నుంచి సెట్ మీదకు వెళ్లి సంక్రాంతికి విడుదల ప్లాన్ చేస్తున్నారు.