చంద్రబాబు అందరికీ పదవులు పంచేశారు. పదవులంటే పార్టీ జెండా మోసే పదవులే. మొత్తానికి వారూ వీరు అని చూడకుండా రాష్ట్ర కమిటీ పేరిట జంబో సైజ్ నే డిజైన్ చేసి వదిలారు.
ఇందులో ఇప్పటికి వారు చాన్స్ రాని మిగిలిన నాయకులను తీసుకున్నారు. మొత్తానికి బొబ్బిలి రాజ సుజయ క్రిష్ణ రంగారావుకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి లభించింది ఇక విశాఖ జిల్లా నుంచి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ ని ప్రధాని కార్యదర్శిని చేశారు.
శ్రీకాకుళం నుంచి గౌతు శిరీషను కూడా ఇదే పదవికి తీసుకున్నారు. అలాగే విశాఖలో మరో ఇద్దరు నేతలకు కూడా అవకాశం ఇచ్చారు.
ఇక కార్యదర్శుల పేరిట చాలా ఎక్కువ మందినే తీసుకున్నారు. ఇలా అన్ని రకాలుగా పదవులు భర్తీ చేసిన చంద్రబాబు ఎందుకో సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు పదవి ఇవ్వలేదన్న మాట వినిపిస్తోంది.
మరి గంటాను బాబు దూరం పెట్టారా, లేక గంటానే పార్టీకి దూరం జరిగారా అన్నది తెలియడంలేదు కానీ గంటాను తప్పించి ఆయన చుట్టూ ఉన్న వారందరికీ పార్టీలో ఏదో ఒక ముఖ్య పదవి ఇవ్వడం ద్వారా బాబు తనదిన రాజకీయం చూపించారని అంటున్నారు.