బంగార్రాజు..సంక్రాంతి విందు

అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు.  సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బుధవారం హీరో నాగ చైతన్య…

అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు.  సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బుధవారం హీరో నాగ చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.

-నాన్న, తాతతో కలిసి మనం సినిమాలో నటించినపుడు కాస్త భయంగా ఉండేది. ఎక్స్‌పీరియెన్స్ వల్ల కావచ్చు బంగార్రాజులో అంతగా భయం అనిపించలేదు. పూర్తిగా ఓపెన్ అయిన నటించాను.

-షూటింగ్ కంటే ముందే నాన్నను, కళ్యాణ్‌ను చాలా డౌట్స్ అడిగాను. నేను మొదటి సారి సీక్వెల్‌ చేశాను. నాకు అదే భయంగా ఉంది. బంగార్రాజు పాత్రను ఓన్ చేసుకునేందుకు సోగ్గాడే సినిమాను చాలా సార్లు చూశాను. చాలా హోం వర్క్ కూడా చేశాను.

-సినిమాలో రెండు పాత్రలు సమానంగానే ఉంటాయి. నాన్నది గెస్ట్ రోల్ కాదు. బంగార్రాజు పాత్రే ముఖ్యం. ఈ సినిమా మొత్తం నాన్నగారు, రమ్యకృష్ణ మీదే నడుస్తుంది. ఇక రాము పాత్ర అమెరికాలో ఉంటుంది.

సినిమాలో కృతి శెట్టి మెయిన్ హీరోయిన్. ఫెస్టివెల్ మూడ్, సీన్ కోసం అలా సరదాగా హీరోయిన్లను పెట్టారు. ప్రతీ పాటలో మంచి కొరియోగ్రఫీ ఉంటుంది. నాలుగు పాటలను ఎంజాయ్ చేస్తూ చేశాను. పండుగకు ఇలాంటి సినిమాలే రావాలి.

బంగార్రాజు రొమాంటిక్ సినిమా అని కాదు. రొమాన్స్‌లో  ఎంటర్టైన్మెంట్ యాడ్ అయి ఉంటుంది. నాకు నాగలక్ష్మీకి మంచి సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ మాత్రం అస్సలు తగ్గదు.

ఇది ఫెస్టివెల్ సినిమా. ఇది పండుగ కోసం రెడీ చేసిన సినిమా. నాన్న మొదటి నుంచి అదే నమ్మకంతోనే ఉన్నారు. నాలుగేళ్ల క్రితమే ఈ ఐడియా వచ్చింది. కానీ ఇద్దరి డేట్స్ అడ్జస్ట్ అయ్యేసరికి ఇంత టైం అయింది. బంగార్రాజును ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేసేశాం. 90 రోజుల్లో సినిమాను చేశాం.

టికెట్ రేట్లు నాన్నతో చాలా చర్చించాను. ఏప్రిల్‌లో జీవో వచ్చింది. ఆ టికెట్ రేట్లకు తగ్గట్టే బడ్జెట్ ఫిక్స్ చేశాం. ఒక వేళ టికెట్ రేట్లు పెరిగితే.. మాకు బోనస్‌లా అవుతుంది. థాంక్యూ సినిమా విషయంలో దిల్ రాజు నిర్ణయం తీసుకుంటారు. నేను కేవలం నటుడిని. ఏదైనా ఇబ్బంది ఉందా? నిర్మాతను ముందే అడుగుతాను. పరిస్థితిని బట్టి ముందుకు వెళ్లాల్సిందే.

బంగార్రాజు పాత్ర కోసం తాతగారి వస్తువులను నాన్న ఏవైతే వాడారో నేను కూడా అన్నీ వాడాను.

కృతి శెట్టి చాలా మంచి నటి. చాలా హోం వర్క్ చేస్తుంది. ఆమె డెడికేషన్ వేరే లెవెల్. సర్పంచ్ నాగలక్ష్మీ పాత్రలో కృతి శెట్టి అద్భుతంగా నటించింది. ఈ పాత్రకు న్యాయం చేసింది.

యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేశారు. లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టు ఉంటాయి. కర్రతో ఫైట్ ఉంటుంది. దాని కోసం కర్రసాము కూడా నేర్చుకున్నాను.

ఈ సినిమా సంక్రాంతికి ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. థ్యాంక్యూ సినిమా తరువాత అమెజాన్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయబోతోన్నాను. అది కూడా విక్రమ్ కే కుమార్‌తోనే చేయబోతోన్నాను. హారర్ సినిమాలంటే నాకు భయం. కానీ ఆ జానర్‌లో ఓ సినిమా చేస్తాను. విజయ్ కనకమేడల గారితో ట్రావెల్ చేస్తున్నాను. ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ అవ్వలేదు. లాల్ సింగ్ చద్దా షూటింగ్ పూర్తయింది. 

చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. కంటెంట్ అనేది కింగ్. ఆడియెన్స్‌కి ఏది నచ్చితే అదే హిట్ అవుతుంది.