సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగ్ డబుల్ రోల్ చేసాడు. తండ్రీ కొడుకులుగా. దాని సీక్వెల్ బంగార్రాజులో తాతగా నాగ్, మనవడు గా చైతన్య కనిపిస్తున్నారు. మరి ఇంతకీ తండ్రి రామ్ క్యారెక్టర్ ఏమైనట్లు? తల్లిగా లావణ్య త్రిపాఠీ ఏమైనట్లు?
తండ్రి రామ్ క్యారెక్టర్ బంగార్రాజులో కనిపిస్తే డబుల్ రోల్ అవుతుంది కదా? ఇంతకీ విషయం ఏమిటి? వినిపిస్తున్న సమాచారం ప్రకారం బంగార్రాజులో రామ్ క్యారెక్టర్ కూడా కనిపిస్తుందని తెలుస్తోంది.
సినిమాలో కొడుకు (చైతన్య)ను తల్లికి అప్పగించి రామ్ అండ్ వైఫ్ అమెరికాకు వెళ్లిపోతారు. సినిమా చివరి వరకు తాత..మనవళ్ల మధ్యే నడుస్తుంది. కానీ క్లయిమాక్స్ లో మాత్రం మళ్లీ రామ్ (నాగ్) క్యారెక్టర్ ఎంటర్ అవుతుందని, ఆ క్యారెక్టర్ మీద మాంచి ఫైట్ కూడా వుంటుందని తెలుస్తోంది.
ఇదే నిజమైతే సినిమాలో నాగ్ డబుల్ రోల్ అన్నమాట. నాగ్ డబుల్ రోల్..రమ్యకృష్ణ,. చైతన్య, కృతి శెట్టి, ఇంకా బోలెడు మంది గెస్ట్ హీరోయిన్లు కనిపించే ఈ సినిమాలో రావు రమేష్ విలన్ గా వుంటాడని వినిపిస్తోంది.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 14న విడుదలవుతోంది.