పెళ్లి కాని టాలీవుడ్ హీరోల్లో ఒకరైన విజయ్ దేవరకొండ ఒక మ్యాట్రిమోనీ సైట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. సినిమా వాళ్ల ఇమేజ్ ను వివిధ బ్రాండ్లు తమ ప్రమోషన్ కోసం వినియోగించుకోవడం కొత్త ఏమీ కాదు.
ఈ క్రమంలో ఒక మ్యాట్రిమోనీ సైట్ వాళ్లు విజయ్ చేత ప్రమోట్ చేయించుకుంటూ ఉన్నారు. ఆ యాడ్ కూడా ఒక సినిమా సీన్ షూటింగ్ ను చూపుతూ, సినిమాల్లో ఎలా ఉన్నా నిజజీవితంలో మాత్రం తల్లిదండ్రులే పెళ్లి చూపులు చూడాలన్నట్టుగా విజయ్ చేత ఏదో సందేశం ఇప్పించారు!
సినిమాల్లో చూపించేదంతా రాంగ్ అన్నట్టుగా ఉంది ఈ యాడ్. ఆ సంగతలా ఉంటే.. విజయ్ దేవరకొండ వ్యక్తిగతంగా కూడా ఆరేంజ్డ్ మ్యారేజ్ లను సపోర్ట్ చేస్తున్నట్టేనా… అనేది కూడా ఆసక్తిదాయకంగా ఉంది.
విజయ్ కు ఏదో ఒక లవ్ ఎఫైర్ ఉందని వార్తలు కూడా వచ్చాయి ఆ మధ్య. ఒక అమ్మాయితో విజయ్ ఫొటోలు వైరల్ గా మారాయి. ఆ ప్రేమ కథ ఎంత వరకూ వచ్చిందో కానీ.. విజయ్ దేవరకొండ ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్ కు బ్రాండ్ అబాంసిడర్ లా యాడ్ లో నటించాడు. ఇది కూడా నటనే కదా!