బిహార్‌లో విచిత్రం -యోగిపై నితీష్ ఫైర్‌

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు తుది ద‌శ‌కు చేరాయి. మొద‌ట్లో నితీష్‌కుమార్‌కు అనుకూలంగా ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగినా … ఎన్నిక‌ల ద‌గ్గ‌రికొచ్చే స‌రికి అందుకు పూర్తి విరుద్ధమైన అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీజేపీ–జేడీ (యూ) పొత్తు కుదుర్చుకుని…

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు తుది ద‌శ‌కు చేరాయి. మొద‌ట్లో నితీష్‌కుమార్‌కు అనుకూలంగా ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగినా … ఎన్నిక‌ల ద‌గ్గ‌రికొచ్చే స‌రికి అందుకు పూర్తి విరుద్ధమైన అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీజేపీ–జేడీ (యూ) పొత్తు కుదుర్చుకుని ఎన్నిక‌ల క్షేత్రంలో త‌ల‌ప‌డుతున్నాయి. 

మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు నితీష్‌కుమార్ శ‌త విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. అలాగే నితీశ్‌ను గ‌ద్దె దింపి అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌ని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని కూట‌మి త‌హ‌త‌హలాడుతోంది.

ఈ నేప‌థ్యంలో బిహార్‌లో ఎన్నిక‌లు తుది అంకానికి చేరుకున్న ద‌శ‌లో బీజేపీ స్టార్ క్యాంపెయిన‌ర్ అయిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి చేసిన ఓ ప్ర‌క‌ట‌న కాక‌రేపుతోంది. 

యోగి మాట‌ల‌పై మిత్ర‌ప‌క్ష నేత‌, ముఖ్య‌మంత్రి అయిన నితీష్‌కుమార్ ఫైర్ అవుతున్నారు. ఎన్నిక‌ల ర్యాలీలో యోగి మాట్లాడుతూ చొరబాటుదారుల సమస్యను పరిష్కరించడానికి ప్రధాని మోదీ సీఏఏని తీసుకొచ్చారన్నారు. ఈ మాట‌లు కాస్త వివాద‌స్ప‌ద‌మ‌య్యాయి.

యోగి వ్యాఖ్యలపై నితీశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ఏమిటీ నాన్సెన్స్‌ ? ఎవరీ చెత్త మాట్లాడు తున్నారు అంటూ నితీష్‌కుమార్ ధ్వ‌జ‌మెత్తారు. త‌న ప‌క్షాన ఉన్న ముస్లిం మైనార్టీల్లో యోగి ఆదిత్య‌నాథ్ వ్యాఖ్య‌లు వ్య‌తిరేక‌త పెంచుతాయ‌ని నితీశ్ ఆందోళ‌న చెందుతున్నారు. అయితే యోగిపై నితీష్ విరుచుకుప‌డ‌డాన్ని ప్ర‌త్య‌ర్థులు త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. 

ముస్లింల అణ‌చివేత‌కు పాల్ప‌డుతున్న బీజేపీతో చెట్ట‌ప‌ట్టాలేసుకున్న తిరుగుతున్న నితీష్‌కు ఓట్లు ఎలా వేస్తారంటూ ప్ర‌త్య‌ర్థులు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

కంగ‌నాపై ముంబైలో ఒక కేసు