మెగా అనాధ ఆ సినిమా

తెలుగు నాట ఏ చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ముందుకు వచ్చి ప్రమోట్ చేసి, తన వంతు సాయం చేస్తారు మెగాస్టార్ చిరంజీవి. అలాంటిది స్వయంగా ఆయన అల్లుడు కళ్యాణ్ దేవ్…

తెలుగు నాట ఏ చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ముందుకు వచ్చి ప్రమోట్ చేసి, తన వంతు సాయం చేస్తారు మెగాస్టార్ చిరంజీవి. అలాంటిది స్వయంగా ఆయన అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి సినిమాను మాత్రం ఎందుకనో అలా వదిలేసారు. 

కాస్త ఖర్చుతోనే నిర్మించారు సూపర్ మచ్చి సినిమాను గట్టి స్టార్ కాస్ట్, థమన్ మ్యూజిక్ ఇలా బాగానే ఖర్చు చేసారు. 

సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నారు. కానీ హీరో ఎక్కడున్నారో తెలియదు. ప్రమోషన్ లకు ఆయన కనిపించడం లేదు. ఆఖరికి ట్రయిలర్ ను కూడా సింపుల్ గా వదిలేసారు.

ఎవరెవరి ట్రయిలర్లు, టీజర్లు విడుదల చేసే మెగా ఫ్యామిలీ జనాలు ఎవ్వరికీ ఈ ట్రయిలర్ ఊసే పట్టినట్లు లేదు. మెగా ఫ్యామిలీకి కళ్యాణ్ దేవ్ కు మధ్య దూరం పెరుగుతోందని ఆ మధ్య గ్యాసిప్ లు వినిపించాయి. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఆ గ్యాసిప్ లు మళ్లీ గుర్తుకు వస్తున్నాయి.