హిందీలో హిట్టయిన 'అంథాధూన్' సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు నితిన్. దీనికి సంబంధించి కాస్టింగ్ సెలక్షన్ కూడా పూర్తయింది.
హీరోయిన్ గా నభా నటేష్ ను తీసుకున్నారు. అయితే ఒరిజినల్ వెర్షన్ లో చూపించినట్టు ఇందులో హాట్ సీన్స్ ఉంటాయా? నితిన్-నభా మధ్య ఘాటు సన్నివేశాలుంటాయా? ఇవన్నీ తెలిసే నభా నటేష్ ఒప్పుకుందా?
ఈ అనుమానాలన్నింటికీ నభా నటేష్ సమాధానం ఇచ్చింది. అంధాధూన్ రీమేక్ లో తన క్యారెక్టర్ కు సౌత్ టచ్ ఉంటుందని చెప్పుకొచ్చింది నభా నటేష్. అంటే… హిందీలో రాధికా ఆప్టే చేసినట్టు ఘాటు సన్నివేశాలు, తెలుగులో ఉండవని నభా పరోక్షంగా చెప్పినట్టయింది.
కేవలం నభా సన్నివేశాలు మాత్రమే కాదు.. హిందీలో టబు పోషించిన నెగెటివ్ రోల్ లో కూడా మార్పుచేర్పులు చేశారు. అలాంటి మార్పులు జరిగిన తర్వాతే టబు పాత్రను తెలుగులో పోషించేందుకు తమన్న ఒప్పుకుంది.
ఈ నెలాఖరు నుంచి అంధాధూన్ తెలుగు రీమేక్ షూటింగ్ లో పాల్గొంటానంటోంది నభా నటేష్. ఈ రీమేక్ ను మేర్లపాక గాంధీ డైరక్ట్ చేయబోతున్నాడు.