హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై ఆయన భార్య, ప్రముఖ నటి జీవిత బుధవారం స్పందించారు. రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
రాజశేఖర్ మినహా ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు కోలుకున్నారు. అయితే రాజశేఖర్ పరిస్థితి ఒక దశలో చాలా క్రిటికల్‌గా మారింది. దీంతో తన తండ్రి త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కోరిన విషయం తెలిసిందే.
తాజాగా రాజశేఖర్ ఆరోగ్యంపై ఆయన భార్య జీవిత స్పందిస్తూ …ముందుకన్నా చాలా మెరుగ్గా ఉన్నట్టు చెప్పారు. వైద్యానికి ఆయన సహకరిస్తున్నట్టు జీవిత తెలిపారు. అయితే మొదట చాలా క్రిటికల్ స్టేజ్ వరకు వెళ్లినట్టు జీవిత స్పష్టం చేశారు.
ఆ సమయంలో వైద్యులతో పాటు తాము కూడా ఆయన ఆరోగ్యంపై భయాందోళనకు గురైనట్టు ఆమె తెలిపారు.అయితే వైద్యులు ప్రతి క్షణం ఆయన్ను కనిపెట్టుకుని మెరుగైన వైద్యం అందిస్తూ వచ్చారన్నారు.
ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ అవసరం లేకుండా వైద్యం అందుతున్నట్టు జీవిత తెలిపారు. త్వరలో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని జీవిత తాజా అప్డేట్స్ అందించారు. దీంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.