అయ్యప్పన్ కోషియమ్ సినిమాకు సంబంధించి హీరో పవన్ తో నిర్మాత నాగవంశీ ఫైనల్ డిస్కషన్లు పూర్తయ్యాయి. ఈ మేరకు దర్శకుడు సాగర్ తో కలిసి వెళ్లి హీరో పవన్ కళ్యాణ్ ను కలిసారు.
కథలో ఏ పాత్రకు ఎవర్ని తీసుకోవాలని అనుకుంటున్నారో ఆయనకు చెప్పి వచ్చినట్లు బోగట్టా. సినిమాలో పవన్ – రానా తో పాటు ఐశ్వర్య రాజేష్, సత్యరాజ్ ఇంకా మరో కీలక నటి వుంటారని తెలుస్తోంది.
మూల కథలో చిన్నచిన్న మార్పులు చేసినట్లు బోగట్టా. వాటిని పవన్ కు వివరించి ఒపీనియన్ తీసుకున్నారని తెలుస్తోంది. వకీల్ సాబ్ లో తన వర్క్ పూర్తి కాగానే ఈ సినిమాకు మీదకు వస్తానని పవన్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.
అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ చిన్న షెడ్యూలు చేసి, అవుట్ డోర్ లోకేషన్ కు వెళ్లిపోతారు. ఒకే సింగిల్ షెడ్యూలులో సినిమా మొత్తం పూర్తి చేసారు.