శీర్షికలో తప్పేం లేదు. లూసిపర్ రీమేక్ కు సరైన డైరక్టర్ ఎవరా అని చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.
ఇప్పటికే ఈ రీమేక్ కు వివి వినాయక్ పేరు ఖరారయింది. ఆయన ఫుల్ రెడీగా వున్నారని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇంకా మరెవరైనా ఈ సబ్జెక్ట్ ను పెర్ ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలరా? అని మెగాస్టార్ అన్వేషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.
పైగా వివి వినాయక్ కు కూడా లూసిఫర్ రీమేక్ ను డైరక్ట్ చేయడంపై పూర్తి ఆసక్తి లేదని తెలుస్తోంది. కొన్ని సినిమాలు టచ్ చేయకుండా వుంటే బెటర్ అనే ఆలోచనతో ఆయన వున్నారని తెలుస్తోంది.
కాదూ, చేద్దాం అని మెగాస్టార్ అంటే మాత్రం చేయాలనే అనుకుంటున్నారట. అయితే మెగాస్టార్ మాత్రం లూసిఫర్ రీమేక్ కు వివి వినాయక్ కాకపోతే సరైన ఆప్షన్ ఎవరు అనే అన్వేషణ సాగిస్తున్నారని తెలుస్తోంది.
అందుకే ఈ ప్రాజెక్టును అలా వుంచి మెహర్ రమేష్, బాబి లతో తరచు డిస్కషన్లు చేస్తూ, వారి సినిమా స్క్రిప్ట్ వర్క్ ల మీద సలహాలు సూచనలు ఇస్తున్నారని బోగట్టా.