పాపం సంజన.. మళ్లీ బెయిల్ నిరాకరణ

శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టైన సినీ నటి సంజనకు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కర్నాటక హైకోర్టు తిరస్కరించింది. విచారణ కీలక దశకు చేరుకున్న వేళ, రిమాండ్…

శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టైన సినీ నటి సంజనకు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కర్నాటక హైకోర్టు తిరస్కరించింది. విచారణ కీలక దశకు చేరుకున్న వేళ, రిమాండ్ ను రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. 

మరో నటి రాగిణి ద్వివేదితో పాటు మరో నలుగురు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు కొట్టేసింది.డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 8న సంజన ఇంట్లో సోదాలు జరిపారు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు. 

అదే రోజు సంజనాను అరెస్ట్ చేశారు. అంతకంటే ముందే రాగిణి ద్వివేది ఇంట్లో సోదాలు చేసిన అధికారులు ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు.

కన్నడ చిత్రసీమలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న రాకెట్ తో సంజనాకు చాలా క్లోజ్ కాంటాక్ట్స్ ఉన్నాయని, ఆమె స్వయంగా డ్రగ్స్ సేవించి ఉండొచ్చని భావిస్తున్నారు అధికారులు. సీసీబీ వాదనలతో కోర్టు ఏకీభవించి, సంజన-రాగిణిలకు బెయిల్ ఇవ్వలేదు.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి రంగంలోకి దిగిన ఈడీ, తన దర్యాప్తును పూర్తిచేసింది. విచారణలో భాగంగా సంజనా ఆస్తుల వివరాలు తెలుసుకొని ఈడీ అధికారులు అవాక్కయ్యారు. ఓ సాధారణ హీరోయిన్ అయిన సంజన, భారీగా ఆస్తులు కూడబెట్టింది.  

అయితే అవన్నీ తన స్వార్జితమని, డ్రగ్స్ అమ్ముకొని డబ్బు సంపాదించాల్సిన అవసరం తనకు లేదని గతంలో సంజన కొట్టిపారేసింది. మాల్ ఓపెనింగ్స్, యాడ్స్, ఫొటోషూట్స్ ద్వారా కోట్లలో సంపాదించినట్టు తెలిపింది.

ఈ కేసుకు సంబంధించి ముంబయిలోని వివేక్ ఒబరాయ్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వివేక్ ఒబరాయ్ బామ్మర్ది ఆదిత్య అల్వా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇతడి ద్వారానే కన్నడ చిత్రసీమకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. 

ఇలాంటి కథ ఎప్పుడూ వినలేదు