దుబ్బాక ఉపఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే!

దుబ్బాక ఉప ఎన్నికపై కీలకమైన సంస్థలు పెద్దగా దృష్టిపెట్టినట్టు కనిపించలేదు. దీంతో ప్రముఖ సంస్థలేవీ ఉప ఎన్నికపై ఎగ్జిట్ పోల్ అంచనాల్ని విడుదల చేయలేదు. రెండు సంస్థలు మాత్రం తమ సర్వేల్ని బయటపెట్టాయి. Advertisement…

దుబ్బాక ఉప ఎన్నికపై కీలకమైన సంస్థలు పెద్దగా దృష్టిపెట్టినట్టు కనిపించలేదు. దీంతో ప్రముఖ సంస్థలేవీ ఉప ఎన్నికపై ఎగ్జిట్ పోల్ అంచనాల్ని విడుదల చేయలేదు. రెండు సంస్థలు మాత్రం తమ సర్వేల్ని బయటపెట్టాయి.

థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ సంస్థ టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. 51 శాతం నుంచి 54 శాతం ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థికి పడతాయంటోంది ఈ సంస్థ. రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో కాంగ్రెస్ నిలుస్తాయట.

ఇక పొలిటికల్ ల్యాబోరేటరీ అనే మరో సంస్థ తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని అంచనా వేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి 47 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలుస్తారని చెబుతోంది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో 23 మంది అభ్యర్థులు పోటీపడగా.. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి సుజాత, బీజేపీ నుంచి రఘునందన్, కాంగ్రెస్ నుంచి శ్రీనివాసరెడ్డి బరిలో నిలిచారు.

ఎగ్జిట్ పోల్ సర్వే  ఫలితాల్ని పక్కనపెడితే.. దుబ్బాకలో మరోసారి భారీగా పోలింగ్ నమోదైంది. నియోజకవర్గ పరిధిలో 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తే.. 82.61 శాతం పోలింగ్ నమోదైంది. అయితే 2018లో జరిగిన ప్రధాన ఎన్నికలతో పోలిస్తే, దుబ్బాకతో 3.63 శాతం పోలింగ్ తగ్గింది. ఈనెల 10న ఎన్నిక ఫలితాలు విడుదలకాబోతున్నాయి. అప్పటివరకు ఉత్కంఠ తప్పదు.

ఇలాంటి కథ ఎప్పుడూ వినలేదు