ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు ఆమె ప్రియుడు, కాబోయే భర్త ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పాడు. నటుడు విష్ణు విశాల్, గుత్తా జ్వాల గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే.
లాక్‌డౌన్ సమయంలో జ్వాల పుట్టిన రోజు సందర్భంగా వాళ్ల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. గుత్తా జ్వాల క్రీడాకారిణిగా ఎంత పాపులరో, ముక్కుసూటి తనంతో వివాదాల పరంగా కూడా వార్తల్లో వ్యక్తిగా అనేక సందర్భాల్లో నిలిచిన విషయం తెలిసిందే.
కాగా అకాడమీ నెలకొల్పడం తన కలగా జ్వాల గత కొంత కాలంగా చెబుతూ వచ్చారు. తన కలను నేటికి నెరవేర్చుకున్నారు. మొయినాబాద్‌లో 600ల సీటింగ్ కెపాసిటీతో 14 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కోర్ట్స్, క్రికెట్ అకాడమీ, స్విమింగ్ పూల్, వరల్డ్ క్లాస్ జిమ్, యోగా సెంటర్లను గుత్తా జ్వాల ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్స్‌లెన్సీని సోమవారం తెలంగాణ మంత్రి, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
అయితే ఈ ఓపెనింగ్‌కు కాబోయే భర్త విష్ణు విశాల్ హాజరు కాలేదు. దీంతో ఆయన తన కాబోయే శ్రీమతికి క్షమాపణలతో పాటు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.
‘ వుహ్.. ఇది నీకు బిగ్ డే.. జ్వాలా గుత్తా అకాడమీ ప్రారంభమైంది. దేశంలోనే అతిపెద్ద బ్యాడ్మింటన్ అకాడమీ. జ్వాలా నన్ను క్షమించు. ఈరోజు హైదరాబాద్ రాలేక పోయాను. అందుకే నా ట్విట్టర్ స్నేహితులు, నా నుంచి నీకు శుభాకాంక్షలు చెబుతున్నాను. కానీ గుర్తుంచుకో.. ఇది బిగినింగ్ మాత్రమే’ అని ఆయన ట్వీట్ చేశాడు.