సంక్రాంతి సినిమాలకు కష్టమేనా?

అనుకున్నంతా..భయపడినంతా అయింది. ఆంధ్రలో సినిమా థియేటర్లకు కోవిడ్ సెగ తగిలింది. ఇకపై సగం ఆక్యుపెన్సీతోనే రన్ చేయాలి. అలాగే సెకెండ్ షోకి అవకాశం తక్కువ. సంక్రాంతికి అసలే పెద్ద సినిమాలు రాకుండా అయిపోయింది. బంగార్రాజు,…

అనుకున్నంతా..భయపడినంతా అయింది. ఆంధ్రలో సినిమా థియేటర్లకు కోవిడ్ సెగ తగిలింది. ఇకపై సగం ఆక్యుపెన్సీతోనే రన్ చేయాలి. అలాగే సెకెండ్ షోకి అవకాశం తక్కువ. సంక్రాంతికి అసలే పెద్ద సినిమాలు రాకుండా అయిపోయింది. బంగార్రాజు, రౌడీ బాయిస్, హీరో సినిమాలు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు వీటికి సంక్రాంతి పండగ మూడు రోజులు మంచి కలెక్షన్లు నమోదు అవుతాయి అనుకుంటే ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలు విధించింది.

ఇకపై థియేటర్లు యాభై శాతం ఆక్యుపెన్సీతోనే రన్ చేయాల్సి వుంటుంది. అలాగే సెకెండ్ షో వేసుకోవడం కష్టం అవుతుంది. టైమ్ లు మార్నింగ్ షో నుంచి అడ్జ‌స్ట్ చేసుకుంటూ రావాల్సి వుంటుంది. కానీ ఇలా అయితే జ‌నం అలవాటు పడతారా అన్నది చూడాలి.

యాభైశాతం ఆక్యుపెన్సీ అన్నది సినిమాలకు మామూలు రోజుల్లో ఓకె కానీ, పండగ సీజ‌న్ లో మాత్రం కాదు. వస్తున్న మూడు సినిమాల్లో రౌడీ బాయిస్, హీరో సినిమాలకు సమస్య కాదు కానీ, బంగార్రాజు సినిమాకే సమస్య. ఎందుకంటే చాలా మంచి రేట్లకు బంగార్రాజు హక్కులు విక్రయించారు. ఇప్పుడు బయ్యర్లు ఆ అమౌంట్లు కడతారా? అన్నది చూడాలి.

క్రాక్ విషయంలో ఇలాంటి సమస్యే ఎదురయింది గత ఏడాది. అప్పుడు బయ్యర్లు బాగానే డబ్బులు కట్టారు. ఇప్పుడు బంగార్రాజు సినిమాకు మార్కెట్ లో క్రేజ్ వుంది. అందువల్ల సమస్య రాకపోవచ్చు.రౌడీ బాయిస్ నిర్మాత దిల్ రాజు స్వంత సినిమా. ఆయన రెగ్యులర్ బయ్యర్లు వుంటారు సో..నో ప్రోబ్లమ్. హీరో సినిమా అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ల స్వంత ప్రొడక్షన్. అందువల్ల పెద్ద ఇబ్బందీ వుండదు.