హీరో..క్రియేటివ్ పీపుల్ కథ చెప్పరు

హీరో మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ తెరగ్రేంటం చేస్తూ అందిస్తున్న తొలి సినిమా హీరో. ఈ సినిమా ట్రయిలర్ ను దర్శకుడు రాజామౌళి విడుదల చేసారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అందించిన ఈ…

హీరో మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ తెరగ్రేంటం చేస్తూ అందిస్తున్న తొలి సినిమా హీరో. ఈ సినిమా ట్రయిలర్ ను దర్శకుడు రాజామౌళి విడుదల చేసారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అందించిన ఈ సినిమా ట్రయిలర్ డిఫరెంట్ గా వుంది.

సినిమాలో చాలా వుంది అనిపిస్తోంది ట్రయిలర్ చూస్తుంటే. ట్రయిలర్ చివర్న ఓ డైలాగు వుంది. క్రియేటివ్ పీపుల్ కథ చెప్పరు అని. ఈ ట్రయిలర్ చూస్తుంటే అదే దానికి ఆప్ట్ అనిపిస్తోంది.

శ్రీరామ్ ఆదిత్య కథను పూర్తిగా దాచేసి, లింక్ కలపని సీన్లు మాత్రం వేసినట్లు కనిపిస్తోంది. సినిమాలో కథ చాలా విస్తృతంగా వున్నట్లు కనిపిస్తోంది. బోలెడు మంది నటులు, బోలెడు సీన్లు మొత్తం ట్రయిలర్ లోకి వచ్చాయి. హీరో క్యారెక్టర్, బ్యాక్ డ్రాప్ మాత్రమే క్లారిటీ ఇచ్చారు. కానీ ఆ క్యారెక్టర్ చుట్టూ అల్లుకున్న ఇంత భారీ కథేంటీ అన్నది మాత్రం దాచారు.

సినిమాలో కమెడియన్స్ బాగానే వున్నా, వాళ్లని కూడా ట్రయిలర్ లోకి తెచ్చినా, వాళ్ల మీద కామెడీ మాత్రం కట్ చేయలేదు. జ‌స్ట్ వున్నారని పరిచయం చేసారంతే. మొత్తం మీద కొత్త కుర్రాడితో కాస్త భారీ ప్రయత్నమే చేసినట్లు కనిపిస్తోంది.