అందరికీ అదృష్టం కలిసి రాదు. కొందరు అదృష్టాన్ని తమ గ్లామర్ కు ముడేసి లాగాలనుకుంటారు. చాన్స్ లు రావాలంటే కాస్త చొరవ చూపాలనుకుంటారు. నార్త్ కు చెందిన ఓ అమ్మడు ఇలాగే అనుకుంటోందట.
తన మేనేజర్ ద్వారా నిర్మాతలతో పరిచయాలు సంపాదిస్తోంది. వాళ్లను తెలీసీ తెలియనట్లు, వినిపించీ వినిపించనట్లు, కనిపించీ కనిపించనట్లు కవ్వింపు సిగ్నల్స్ ఇస్తోందట.
అయితే ఇక్కడ కండిషన్ అప్లయ్ ఒకటి వుంది. కచ్చితంగా సినిమాలు క్యారెక్టర్ అయితే ఇవ్వాల్సిందే. మరీ అంత గ్లామర్ ఫిగరేం కాదు. లీన్ పర్సనాలిటీతో, వైట్ స్కిన్ తో చూడ్డానికి ఓకె అనే పర్సనాలిటీ. అందుకే అంత త్వరగా చాన్స్ లు ఏవీ రావడం లేదు.
అన్నట్లు ఈ మధ్యే ఈ అమ్మడు ఓ హీరో కళ్లతో కళ్లు కలిపి, మూగ సైగలు చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ అమ్మడు ఆ అమ్మడు ఓకటే అంటున్నారు. ఏమిటో కథ.