`హీరో` సంక్రాంతి సినిమా – శ్రీ‌రామ్ ఆదిత్య

భలే మంచి రోజు, శమంతకమణి, దేవ్ దాస్ సినిమాలు అందించిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ప్రస్తుతం ఆయన కొత్త హీరోతో సినిమా చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు, గుంటూరు…

భలే మంచి రోజు, శమంతకమణి, దేవ్ దాస్ సినిమాలు అందించిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ప్రస్తుతం ఆయన కొత్త హీరోతో సినిమా చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడే అశోక్ గల్లా. నిధి అగర్వాల్ హీరోయిన్‌. ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య మీడియా స‌మావేశంలో ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు.

– నా ద‌గ్గ‌రున్న క‌థ‌కు అశోక్ క‌రెక్ట్‌గా స‌రిపోతాడ‌ని భావించి ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుకున్నాను. నా ద‌గ్గ‌ర వున్న క‌థ‌కు కొత్త‌వారైతేనే పూర్తి న్యాయం జ‌రుగుతుంద‌నే అశోక్ ను తీసుకున్నాం .టైటిల్ ప‌రంగా చెప్పాలంటే హీరో అవ్వాల‌నుకునే కుర్రాడి క‌థ కాబ‌ట్టి యాప్ట్ గా అనిపించింది.

– చాలామంది ఏదో సంద‌ర్భంలో హీరో అవ్వాల‌నుకుంటారు. న‌లుగురిలో మంచి పేరు తెచ్చుకోవాల‌ని ఫీలింగ్ వుంటుంది. ఇది కామ‌న్ పాయింట్ ఇది నా అనుభ‌వంతో తీసిన క‌థ‌కాదు. చుట్టూ స్ట‌డీచేసి రాసుకున్న క‌థ‌.

– `హీరో` సినిమా ఎటువంటి విసుగు కలిగించ‌కుండా క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో తీశాం. చూసిన ప్రేక్ష‌కుడు రెండు గంట‌లు న‌వ్వుకుంటూనే వుంటారు. అశోక్‌ను కొత్త హీరోని చూశామ‌నే ఫీలింగ్ క‌ల‌గ‌దు.

– జోన‌ర్ ప‌రంగా చెప్పాలంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్ వుంటూనే ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ స్కృశించ‌ని అంశం ఇందులో వుంటుంది. విడుద‌లైన టీజ‌ర్‌లో అశోక్ ను కౌబాయ్‌గా, జోక‌ర్‌గా ఇలా చూసుంటారు. క‌థ‌లో అటువంటి వైవిధ్యాలు కుదిరాయి.

– కౌబాయ్ సినిమా చేయాల‌నేది ఎప్ప‌టినుంచో నా డ్రీమ్‌. అటువంటి సినిమా అంటేనే సూప‌ర్ స్టార్ కృష్ణ‌, మ‌హేష్‌బాబు గుర్తుకు వ‌స్తారు. సినిమాలో మొద‌టి ప‌దినిముషాలు అస్స‌లు మిస్ కావ‌ద్దు.

– సినిమాకు గేప్ రావ‌డం అనేది కోవిడ్ వ‌ల్ల అని చెప్ప‌వ‌చ్చు. నా ద‌గ్గ‌ర ప‌ది క‌థ‌లున్నాయి. నాకు కొత్త‌గా అనిపిస్తేనే, ఎవ్వ‌రూ ఈ పాయింట్‌ను చెప్ప‌లేద‌ని అనుకుంటేనే సినిమా చేస్తాను. హీరో సినిమాలో అటువంటిదే చూస్తారు.

– అశోక్‌ను చూస్తే కొత్త‌వాడ‌నే ఫీలింగ్ రాకూడ‌ద‌ని మెగాస్టార్ చిరంజీవి, మ‌హేష్‌బాబు సినిమాలు చూడ‌మ‌ని చెప్పాను. వారిలో కామేడీ టైమింగ్ నాకు బాగా న‌చ్చుతుంది. యాక్టింగ్ కోర్సు చేయ‌డంకంటే చాలామంది స్టార్స్‌ను చూసి మ‌నం చాలా నేర్చుకోవాల్సి వుంటుంది. వారిని ప‌రిశీలించి మ‌న‌కు న‌చ్చింది మ‌న‌కు అప్ల‌య్ చేసుకోవాలి. అందుకే అశోక్‌ను సినిమాలు చూడ‌మ‌ని చెప్పాను.

– హీరో యు.ఎస్‌.లో చ‌దివినా త‌న‌కు తెలుగు రాయ‌డం, మాట్లాడ‌డం బాగా తెలుసు. నాకే స‌రిగ్గా తెలీదు. డ‌బ్బింగ్ కూడా త‌నే చెప్పుకున్నాడు.

– లాక్‌డౌన్ వ‌ల్ల న‌టీన‌టుల్లో ఆహార్యంలో తేడాలున్నా క‌థ‌లో మాత్రం ఎటువంటి మార్పులేకుండా తీశాం. కంటెన్యూటీ సీన్స్ అనేవి ఛాలెంజింగ్ అనిపించాయి.

– సూపర్ స్టార్ కృష్ణ నేను చేసిన `భ‌లేమంచి రోజు` చూశారు. మెచ్చుకున్నారు. ఇప్పుడు `హీరో` సినిమా చూశారు. చాలా బాగాతీశామ్ అన్నారు. ఆయ‌న మాట మాకు ఎంతో ఆనందంగా అనిపించింది.