ముందు నోరు జారడం ఆ తర్వాత నాలుక్కరుచుకోవడం ఇదంతా ప్రజా ప్రతినిధులకు అలవాటే. తాము మాట్లాడిన అంశం వివాదాస్పదమైతే అలాంటి వ్యాఖ్యలే చేయలేదని తప్పును కప్పి పుచ్చుకుంటారు. అయిన రాజకీయ నాయకులకు నోరు జారడం కామన్ అవుతోంది. తాజాగా డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సెల్ప్ గోల్ చేసుకున్నారు.
ఓ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. నేను దొంగ ఓట్లతో గెలిచా… నా సొంతూను చింతలమోరులో నా అనుచరులు ఒక్కొక్కరు పదేసి దొంగ ఓట్లు వేశారు. అక్కడ ఓట్లు ఉంటాయి. కానీ ఎవరో ఎవరికీ తెలియదు. గతంలో వచ్చిన 800ఓట్ల మెజార్టీ కూడా అలాగే వచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాపాక మాటలపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కాగా రాపాక జనసేన పార్టీ తరుపున రాజోలు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిన్నటి రోజు కూడా ఓ సమావేశంలో రాపాక మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలుత తెలుగు దేశం పార్టీ తనతోనే బేరసారాలు సాగించిందని.. 10 కోట్ల రూపాయలు ఇస్తామని ఆ పార్టీ నేతలు తనతో బేరం ఆడారని… ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటును అమ్ముకుంటే 10 కోట్లు వచ్చి ఉండేవని, కానీ తాను అలా చేయలేదని ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకుని తిరగలేమన్న రాపాక, సిగ్గు శరీరం వదిలేసి ఉంటే 10 కోట్లు వచ్చి ఉండేవన్నారు. ఇంతలోనే మరో వీడియో వైరల్ అవుతోంది.