మూడురాజధానుల వ్యవహారం, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హై కోర్టులో జరుగుతున్న విచారణలో తమ వాదనలు కూడా వినాలంటూ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల తరఫున దాఖలైన పిటిషన్లను హై కోర్టు ధర్మాసనం కొట్టి వేసింది.
తమ వాదనలు వినాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్లను విచారించడానికి నిరాకరిస్తూ, ఆ పిటిషన్లను తిరస్కరించింది న్యాయస్థానం.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు రాకేష్ కుమార్, మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
మరోవైపు సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలకు సంబంధించి వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లను పై తుది విచారణ కూడా జరుగుతూ ఉంది.
మూడు రాజధానుల వల్ల అమరావతికి ల్యాండ్ పూలింగ్ లో భూములిచ్చిన రైతుల ప్రయోజనాలకు భంగకరమని, ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని, సీఆర్డీఏ రద్దును రద్దు చేయాలన్న కోరికలతో దాఖలైన పిటిషన్లపై హై కోర్టు తుది విచారణను ప్రారంభించింది.