మంత్రి సురేష్‌కు తప్పిన ప్రమాదం!

ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ కు తృటిలో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. విశాఖ‌ప‌ట్నం ఆర్కే బీచ్ లో పారా గ్లైడింగ్ చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పారా గ్లైడ‌ర్ టేకాఫ్…

ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ కు తృటిలో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. విశాఖ‌ప‌ట్నం ఆర్కే బీచ్ లో పారా గ్లైడింగ్ చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పారా గ్లైడ‌ర్ టేకాఫ్ అయ్యే స‌మ‌యంలో ఇంజ‌న్ ఒక్క‌సారిగా ప‌క్క‌కు ఒరిగిపోయింది. ఆ స‌మ‌యంలో మంత్రితో పాటు పైలెట్ కూడా ఉన్నారు. పారా గ్లైడ‌ర్ ప‌క్క‌కు ప‌డే స‌మ‌యంలో అక్క‌డే ఉన్న స్థానికులు ప‌ట్టుకున్నారు.

విశాఖ ఆర్‌కే బీచ్‌లో జీ 20 సదస్సు సన్నాహక భాగంగా ఆదివారం విశాఖలో మారథాన్‌, సాహసక్రీడలను మంత్రులు ఆదిమూలపు సురేష్‌, విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్‌ ప్రారంభించారు. అయితే నిర్వాహకుల ఆహ్వానం మేరకు మంత్రి సురేష్‌ పారా గ్లైడింగ్‌ ఫస్ట్‌ రైడ్‌కు వెళ్లేందుకు ఉత్సాహం చూపించారు. విండ్‌ డైరెక్షన్‌ సహకరించకపోవడంతో వెహికల్‌ కుదుపులకు గురై ఇసుక తిన్నెలో ఒరిగిపోయింది. మంత్రి క్షేమంగా ఉండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

కాగా ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నం వేదికగా జీ-20 సన్నాహక సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే.  ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు విడదల రజని ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్‌నాథ్‌లు శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జీ20 సదస్సుకు సీఎం జగన్‌ హాజరు కాబోతున్నారు. మూడు రోజుల పాటు జరిగే సదస్సుకు దేశ, విదేశాల నుంచి అతిథులు విశాఖ రాబోతున్నారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.