గాత్రం..సంగీతం పెనవేసుకున్నాయి

సాధారణంగా ఒకే దగ్గర పని చేస్తూ వుంటే గ్యాసిప్ లకు కాస్త ఆస్కారం ఎక్కువగానే వుంటుంది. అయితే అలా అని ప్రతిసారీ నిప్పులేకుండానే పొగరాదు. కాస్తో..కూస్తో నిప్పు వుంటూనే వుంటుంది. టాలీవుడ్ లో ఆయనో…

సాధారణంగా ఒకే దగ్గర పని చేస్తూ వుంటే గ్యాసిప్ లకు కాస్త ఆస్కారం ఎక్కువగానే వుంటుంది. అయితే అలా అని ప్రతిసారీ నిప్పులేకుండానే పొగరాదు. కాస్తో..కూస్తో నిప్పు వుంటూనే వుంటుంది. టాలీవుడ్ లో ఆయనో పేరున్న మ్యూజిక్ డైరక్టర్. ఆమె సింగర్. కలిసి స్వరసాధన సాగిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

సదరు మ్యూజిక్ డైరక్టర్ మీద గతంలో కూడా ఇలాంటి గ్యాసిప్ లు వినిపించాయి. కానీ కొన్నాళ్ల గ్యాప్ తరువాత మళ్లీ ఇప్పుడే వినిపించడం మొదలైంది. ఈ బంధం కారణంగా ఆ వర్ధమాన గాయని పేరు ఈ మధ్య ఇండస్ట్రీ సర్కిళ్లలో బాగానే వినిపిస్తోంది.

ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, సాధారణంగా ఇలాంటి ‘ఎగస్ట్రా’ సంబంధాలు కేవలం కొంత వరకే నడుస్తాయి. కానీ ఈ సంగీత దర్శకుడు కాస్త ఎమోషనల్ టైపు అంట. కాస్త రిలేషన్ కలిస్తే డీప్ లోకి వెళ్లిపోతారట. 

పెళ్లయిందన్న సంగతే మరిచిపోయి, పెళ్లి చేసేసుకుందాం అనేంతగా లోతుల్లోకి జారిపోతారట. ఏమిటో ఈ పిచ్చి అనుబంధాలు..పిచ్చి ప్రేమలు.