బాలీవుడ్ న‌టి ఇంట విషాదం!

చోటీ సర్దార్నీ ఫేమ్ నీలు కోహ్లీ భర్త హర్మిందర్ సింగ్ కోహ్లీ బాత్రూంలో జారిపడి మరణించాడు. హర్మిందర్ సింగ్ కోహ్లి నిన్న మధ్యాహ్నం గురుద్వారా వెళ్లి.. తిరిగి వచ్చిన తర్వాత.. బాత్రూమ్‌కు వెళ్లాడని ఎంత‌సేప‌టికి…

చోటీ సర్దార్నీ ఫేమ్ నీలు కోహ్లీ భర్త హర్మిందర్ సింగ్ కోహ్లీ బాత్రూంలో జారిపడి మరణించాడు. హర్మిందర్ సింగ్ కోహ్లి నిన్న మధ్యాహ్నం గురుద్వారా వెళ్లి.. తిరిగి వచ్చిన తర్వాత.. బాత్రూమ్‌కు వెళ్లాడని ఎంత‌సేప‌టికి తిరిగి రాకపోవడంతో, అత‌ని సహాయకుడు తనిఖీ చేయ‌గా ఆయ‌న‌ అప్ప‌టికే అపస్మారక స్థితిలో ప‌డి ఉండ‌టంతో ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది.

నెల రోజుల క్రితమే నీలు ఘ‌నంగా ఆమె భ‌ర్త పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఇంత‌లోనే ఇలా జ‌ర‌గ‌డంతో ఆమె కుటుంబంలో విషాదాన్ని నింపింది. బాలీవుడ్ చిత్రం దిల్ క్యా కరేతో కెరీర్ ప్రారంభించిన నీలు కోహ్లి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది.

ఫక్రే రిటర్న్స్, బాస్, గుడ్ బై, జోగి, హౌస్ ఫుల్ 2 వంటి హిట్ చిత్రాల్లో నీలు కోహ్లీ న‌టించారు. అలాగే చోటీ స‌ర్దార్నీ, మ‌ధుబాలా మొద‌లైన సీరియ‌ల్స్ లోనూ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.