బెజవాడ ఆత్మహత్యల వెనక వేధింపుల పర్వం?

తెలంగాణకు చెందిన ఓ కుటుంబం విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఫైనాన్స్ సంస్థల వేధింపులే ఈ మూకుమ్మడి ఆత్మహత్యలకు కారణమని తెలంగాణ పోలీసులు తేల్చారు. Advertisement…

తెలంగాణకు చెందిన ఓ కుటుంబం విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఫైనాన్స్ సంస్థల వేధింపులే ఈ మూకుమ్మడి ఆత్మహత్యలకు కారణమని తెలంగాణ పోలీసులు తేల్చారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన సురేష్ కుటుంబం, విజయవాడ వచ్చింది. అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం శ్రీ కన్యకాపరమేశ్వరి సత్రంలో వీళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తండ్రి సురేష్, తల్లి శ్రీలత, కొడుకులు ఆశిష్, అఖిల్ ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు.

కాటేజ్ లో తల్లి శ్రీలత, కొడుకు ఆశిష్ ఇన్సులిన్ తీసుకొని సూసైడ్ చేసుకున్నారు. ఒకేసారి శరీరంలోకి 20 బాటిళ్ల ఇన్సులిన్ ఎక్కించుకొని చనిపోయారు. ఇక తండ్రి సురేష్, మరో కొడుకు అఖిల్ కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న రోజు తల్లి శ్రీలత తన అన్నకు వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేసింది. ఇక తండ్రి సురేష్ కూడా తాము నదిలో దూకుతామంటూ బంధువులకు సమాచారం ఇచ్చి మరీ చనిపోయారు.

ఫైనాన్స్ సంస్థ వేధింపులు..?

ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ వేధింపులే ఈ ఆత్మహత్యకు కారణం అయి ఉండొచ్చని ప్రాధమికంగా పోలీసులు నిర్థారణకొచ్చారు. ఎందుకంటే, సురేష్ కుటుంబం విజయవాడ వచ్చిన మరుసటి రోజే నిజామాబాద్ లో అతడి ఫ్లాట్ కు ఫైనాన్స్ సంస్థ సభ్యులు వెళ్లారు. తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత గోడలపై, తలుపులపై ఈ ఫ్లాట్ తమ సంస్థది అంటూ ఎర్రటి అక్షరాలతో రాసి వెళ్లారు. 

అంతకంటే ముందు ఈ కుటుంబం నిర్వహిస్తున్న పెట్రోల్ బంకు, మెడికల్ షాపు వద్ద కూడా సదరు ఫైనాన్స్ సంస్థ సభ్యులు గొడవ చేసినట్టు తెలుస్తోంది. సురేష్ కుటుంబం పరువు తీసేలా వ్యవహరించారట. దీంతో మనస్థాపానికి గురైన సురేష్ కుటుంబం ఇలా సామూహితకంగా ఆత్మహత్యలకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.