అనగనగా ఓ హీరోయిన్. ఆమెకు కరోనా వచ్చింది. 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా తనకి కొవిడ్ సోకినట్టు ఆమె నిన్న ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. సహజంగా గెట్ వెల్ సూన్ అనే రిప్లైలు వస్తాయి. కానీ ఆమెకు మాత్రం అడ్వాన్స్ రిప్ అంటూ మెసేజ్ లు వచ్చాయి. ఒకటి కాదు, రెండుకాదు.. చాలామంది నెటిజన్లు ఆమెను ఆటాడేసుకున్నారు. ట్రోలింగ్ తో పిచ్చెక్కించారు.
హమ్మయ్య ఓ పనైపోయింది, నువ్వు కరోనాతో చచ్చిపోతే మేలు, భూమికి పట్టిన పీడ విరగడవుతుందంటూ మరొకరు, రెస్ట్ ఇన్ హెల్ అంటూ మరికొందరు.. ఇలా దారుణంగా ట్రోలింగ్ నడిచింది. ఈ రేంజ్ లో ట్రోలింగ్ కు గురైన ఆ హీరోయిన్ పేరు స్వర భాస్కర్. ఆమెకు ట్రోలింగ్స్ కొత్త కాదు.
బాలీవుడ్ నటి, బిగ్ బాస్ సంచలనం స్వర భాస్కర్ వివాదాలే కేరాఫ్ అడ్రస్ గా కెరీర్ నెట్టుకొస్తోంది. స్వలింగ సంపర్కానికి మద్దతుగా మాట్లాడి అప్పట్లో హైలెట్ అయింది. ఆ తర్వాత సుశాంత్ సింగ్ మరణం సమయంలో.. అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి మద్దతుగా మాట్లాడి మరోసారి సంచలనంగా మారింది.
ఇటీవల మూడేళ్లుగా ఆమె టచ్ చేయని సబ్జెక్ట్ లేదు, ఎదుర్కోని విమర్శ లేదు. ఒక రకంగా కంగనా రనౌత్ డూప్ గా స్వర భాస్కర్ ని పేర్కొనొచ్చు. ఇంకా చెప్పాలంటే ఆమెకంటే ముందే. అయితే కంగన భారీ సినిమాలు, అవార్డులతో పాపులర్ అయిన తర్వాత వివాదాలతో సావాసం చేస్తే.. స్వర భాస్కర్ అలాంటి అదనపు హంగామా ఏదీ లేకుండా కేవలం నోటితో, ట్వీట్లతో పాపులర్ అయింది.
రెస్ట్ ఇన్ పీస్ అని మెసేజ్ పెట్టడం కూడా నీకు వేస్ట్.. ఎందుకంటే నీవు కచ్చితంగా స్వర్గానికి పోవు, నరకానికే పోతావు, అందుకే రెస్ట్ ఇన్ హెల్ అంటో ఓ నెటిజన్ స్వర భాస్కర్ ని ట్రోలింగ్ చేశాడు. అయితే ఇలా తనకు మెసేజ్ లు పెట్టినవారి గురించి కూడా స్వర భాస్కరే స్వయంగా ట్వీట్ చేయడం విశేషం.
ఇలాంటి వారందరికీ తాను తిండి పెడుతున్నానని, కేవలం తనని ట్రోలింగ్ చేస్తూ ఇలాంటి వారంతా పొట్టపోసుకుంటున్నారని ఆమె మరో ట్వీటేసింది. నేను చనిపోతే మీ అందరికీ తిండి ఉండదు, అందుకే నేను బతకాలని కోరుకోండి అంటూ సెటైర్లు వేసింది.