ఏపీలో మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సంక్రాంతి తరువాత వీటిని ప్రారంభిస్తారు. వీటిని సచివాలయం పరిధిలో చేపల విక్రయాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఆంధ్రా బ్రాండ్ పేరిట గ్రామ, వార్డు సచివాలయాల్లో మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. వీటి ద్వారా వినియోగదారులకు మేలు చేసేలా చర్యలు చేపడతామని అన్నారు.
మొత్తం మీద చూసుకుంటే గత కొంతకాలంగా ప్రతిపాదన దశలో ఉన్న ఫిష్ రిటైల్ అవుట్ లెట్లను కొత్త ఏడాదిలో పెద్ద ఎత్తున ఏపీలో అన్ని జిల్లాలలో ఏర్పాటు చేయనున్నారన్నమాట.ఈ మేరకు ఇప్పటికే సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటనలు జారీ చేసింది. మరిదిపుడు దీనికి శ్రీకారం చుడుతున్నారు. మరి దీనికి ప్రజల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. మరో వైపు విపక్షాల రియాక్షన్ కూడా చూడాలి.
ఇక సచివాలయాల దగ్గర ఈ అవుట్ లెట్లను ఏర్పాటు చేయడం పట్ల కూడా చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ప్రభుత్వం ఆద్వర్యాన చేపల మార్కెట్లకు రంగం సిద్ధమైపోయింది.