బాలీవుడ్ డైరెక్టర్ ప్రదీప్ మృతి

బాలీవుడ్ చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు ప్రదీప్ సర్కార్ (67) కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్ల‌వారుజామున ఆస్ప‌త్రిలో చికిత్స మృతి చెందారు.…

బాలీవుడ్ చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు ప్రదీప్ సర్కార్ (67) కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్ల‌వారుజామున ఆస్ప‌త్రిలో చికిత్స మృతి చెందారు. ఈ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రదీప్ మృతి చెందినట్లు ఆయ‌న బంధువు, న‌టి నీతు చంద్ర శ్రీవాత్స‌వ వెల్ల‌డించారు.  

హెలికాప్ట‌ర్ ఈలా, ప‌రిణీత‌, మార్దానీ వంటి హిట్ చిత్రాలు తీసి గుర్తింపు పొందిన ప్ర‌దీప్.. అలాగే ప‌లు మ్యూజిక్ ఆల్బ‌మ్స్ కూడా డైరెక్ట్ చేశారు. ప్రదీప్ 2006లో స్టార్‌డస్ట్ అవార్డులలో “బెస్ట్ డెబ్యూటెంట్ డైరెక్టర్” ఇన్ స్క్రీన్ అవార్డ్స్ , “హాటెస్ట్ యంగ్ డైరెక్టర్” కూడా గెలుచుకున్నాడు. పరిణీత మూవీ 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది.

ప్ర‌దీప్ మృతిపై ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రదీప్ దాదా మృతిని జీర్ణించుకోలేకపోతున్నాననంటూ బాలీవుడ్ అగ్రనటుడు అజయ్ దేవగణ్ విచారం వ్యక్తం చేశారు.