సోషల్ మీడియానే కాపురాలను విడదీసినా, కలిపినా అన్నట్లు తయారవుతోంది. మొగుడు పెళ్లాల ఇన్ స్టా అక్కౌంట్లు చూసి వారిద్దరి మధ్య ఏపాటి సయోధ్య వుంది. అసలు కలిసి వుంటున్నారా లేదా అన్న వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
మొగుడు పెళ్లాలు కాస్త దూరంగా వుంటే చాలు ఇండస్ట్రీలో గ్యాసిప్ కోళ్లు కూసేస్తున్నాయి. ఇండస్ట్రీలో ఓ సీనియర్ హీరో కుమార్తె ఇప్పుడు తండ్రి సినిమా పనులు చూసుకుంటూ హైదరాబాద్ లోనే వుంటున్నారు. త్వరలో సినిమా నిర్మాణం కూడా చేపడతారని టాక్. కానీ భర్త మాత్రం తన వ్యాపారాలు, తన వ్యవహారాల మీద వేరే ఊళ్లో వుంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు.
దీంతో ఇద్దరికి మధ్య సమ్ థింగ్..సమ్ థింగ్…రాంగ్ అంటూ గ్యాసిప్ లు వినిపించడం మొదలైంది. పైగా సదరు భర్తగారు గత ఆరు నెలలుగా తన ఇన్ స్టా అక్కౌంట్ లో భార్య గారి ఫోటోలు ఏవీ షేర్ చేయలేదు ఎందుకంటా? ఇటీవల అదే ఫ్యామిలీలో విషాదం జరిగితే రాలేదు ఎందుకంటా? అంటూ ఆరా తీయడం మొదలైంది. అంతే కాదు ఆ కుటుంబం మొత్తానికి పెద్ద దిక్కులాంటి ఓ పెద్దాయిన ఇద్దరినీ పిలిచి కాస్త మంచి చెడ్డ చెప్పి పంపారనీ టాక్ కూడానూ.
కానీ విషయం ఎంత వరకు నిజం అన ఆరా తీస్తే…అస్సలు అలాంటి సమస్యే లేదని, ఇద్దరూ ఎవరి వ్యాపారాల్లో, ఎవరి వ్యవహారాల్లో వారు బిజీ అని, త్వరలో భర్త పేరుతోనే భార్య ప్రొడక్షన్ లోకి దిగుతున్నారని కూడా చెబుతున్నారు. మరి ఈ నిప్పు లేని పొగేమిటో?