కృష్ణానది ఒడ్డున మొదలైన అమరావతి నినాదం కేవలం ఏపీలోనే కాదు… ఖండాంతరాల్లో మారుమోగుతుంది. అనుభవరాహిత్యం, అహంకారం, కక్షపూరిత రాజకీయాలు ఏపీని దశ దిశ లేకుండా నడిపిస్తుంటే… పక్క రాష్ట్రాలు కూడా జాలి పడే పరిస్థితి. పరిపాలన వికేంద్రీకరణకు, పాలన వికేంద్రీకరణకు తేడా తెలియకుండా పాలకులు వేస్తున్న పిల్లిమొగ్గలు కొందరు అమాయకులను ఆకట్టుకోవచ్చేమో గాని రాష్ట్ర భవిష్యత్తును మాత్రం అంధకారంలో నెడుతున్నాయి.
తెలుగు వాడు ప్రపంచంలో ఎక్కడ పనిచేసినా ఏ రంగంలో పనిచేసినా… విద్యార్థి నుంచి ఉద్యోగిగా మారడానికి అవసరమైన నైపుణ్యాలు నేర్పింది సకలసదుపాయాలున్న రాజధాని హైదరాబాదు నగరమే. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు ఉండబట్టే దేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలుగు వారి పేరు మారుమోగింది. ఇపుడు అంతకుమించిన రాజధానిని నిర్మించుకోవాలని తలపెట్టిన మహాయజ్జం ఒక వ్యక్తి స్వార్థం వల్ల నాశనమవుతోంది. కుట్ర రాజకీయాలకు బలవుతోంది.
ఏపీ యువత ఉద్యోగం కోసం, అవకాశాల కోసం.. చివరకు స్కిల్ ట్రైనింగ్ కోసం కూడా వెంపర్లాడుతూ వేరే రాష్ట్రాలకు వెళ్లి దేబిరించే ప్రమాదం పొంచిఉంది. అందుకే మన జీవితాలు ఆగం కాకూడదుని, యువతకు భవిష్యత్తు ఉండాలని ఏపీలో ప్రతిఒక్కరు అమరావతి ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. చివరకు తమ ఊరికి రాజధాని ఇస్తామని వైసీపీ చెప్పినా… ఆ వైజాగ్ వాసులు కూడా రాజధానిగా అమరావతే ఉండాలి అని కోరుకుంటున్నారు.
ఏపీలో ప్రతి జిల్లా అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకుంటోంది. ప్రతి పౌరుడు మనకు అంతర్జాతీయ రాజధాని కావాలని కోరుకుంటోంది. ఇపుడు ఎన్నారైలు కూడా దీనికి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. అమెురికా వ్యాప్తంగా రాజధానిగా అమరావతి ఉండాలని నినదిస్తున్నారు.
అమరావతి కొనసాగించాలని బే ఏరియాలో ఒక కార్యక్రమం ఏర్పాటుచేస్తే.. మునుపెన్నడూ ఏ కార్యక్రమానికి రానంత మద్దతు దక్కింది. ఎపుడూ ఏ సమావేశాల్లోనూ కనిపించని కొత్త మొహాలు కనిపించడం అంటే.. అమరావతికి ఏ స్థాయిలో మద్దతు ఉందో ఇట్టే అర్థమైపోతుంది. అమరావతి ఆపితే మనం కోల్పోయేది రాజధాని కాదు… భవిష్యత్తును అంటూ ప్రముఖ ఎన్నారై కోమటి జయరాం చెబుతుండగా ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. ప్రతి ఒక్కరు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిని రాజధానిగా కొనసాగించాల్సిందే అని పట్టుబట్టారు.
పలువురు ఎన్నారైలు అమరావతి తరలింపును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోమటి జయరాంతో పాటు శ్యామల, విలేఖ్య, చేతన తదితరులు మాట్లాడుతూ ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగాలి అని డిమాండ్ చేశారు. వెంకట్ కోగంటి మాట్లాడుతూ భావితరాల కోసం సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ వారు నినదించారు. వందలాది మంది ఎన్నారైలు ప్లకార్డులతో అమరావతికి మద్దతు పలికారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సమావేశంలో జయరాం కోమటి, వెంకట్ కోగంటి, శ్యామల, విజయ గుమ్మడి, గాంధీ పాపినేని, రాజా కొల్లి,సాయి నూతక్కి,మల్లిక్ వేదగిరి ,శివ ప్రసాద్ వోలేటి,వెంకట్ కేతినేని, MV రావు,ప్రసాద్ మంగిన, వీరు ఉప్పల, జయప్రసాద్ వేజెండ్ల, భక్త బల్లా, రజని కాకర్ల, రామ్ తోట, కోనేరు శ్రీకాంత్, శ్రీని వల్లూరిపల్లి, సతీష్ కొండెపాటి, భాస్కర్ వల్లభనేని, హేమంత్, శ్రీకాంత్ దొడ్డపనేని, బాబు పత్తిపాటి, గోకుల్, భరత్ ముప్పిరాల, సతీష్ బొర్రా, చేతన, శిరీష, యశ్వంత్ కుదరవల్లి, రెడ్డయ్య, రమేష్, శ్రీనివాస్ పోతినేని పాల్గొని మాట్లాడారు.