డైరక్టర్ కు హీరో చివాట్లు

నొరు  మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కానీ ఈ సూత్రం టాలీవుడ్ లోని ఓ డైరక్టర్ కు అస్సలు తెలియదు. ఆయన కాస్త విషయం వున్న డైరక్టర్ నే. టాప్ హీరోలతో సినిమాలు తీసారు. కమర్షియల్…

నొరు  మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కానీ ఈ సూత్రం టాలీవుడ్ లోని ఓ డైరక్టర్ కు అస్సలు తెలియదు. ఆయన కాస్త విషయం వున్న డైరక్టర్ నే. టాప్ హీరోలతో సినిమాలు తీసారు. కమర్షియల్ హిట్ లు అనిపించుకున్నారు. ఆ మధ్య ఓ మిడిల్ రేంజ్ హీరోతో సినిమా చేసారు. హిట్ అనిపించుకున్నారు. కానీ అయితేనేం నోటి దురద ఆగదు.

ఈ మధ్య ఓ సినిమా ప్రముఖుడి బర్త్ డే పార్టీ అయింది. దాదాపు చాలా మంది హీరోలు, నిర్మాతలు, టెక్నీషియన్లు, బయ్యర్లు ఇలా చాలా అంటే చాలా మంది హాజరయ్యారు. అలాంటి టైమ్ లో ఒక టాప్ హీరో వున్న గదిలో కొందరు హీరోలు, డైరక్టర్లు గుమిగూడారు. ఆ టైమ్ లో ఏదో డిస్కషన్ వచ్చింది. మార్కెట్ లో వున్న ఓ సినిమా, దాని డైరక్టర్ గురించి మాట్లాడుతూ, అదే డైరక్టర్ అదే హీరోతో వున్న డిజాస్టర్ సినిమా గురించి ఈ నోటి దురద మీడియం డైరక్టర్ కాస్త ఎక్కువే మాట్లాడారు.

అక్కడే వచ్చింది సమస్య. అక్కడ వున్న టాప్ హీరోకు తన డిజాస్టర్ సినిమా గురించి టచ్ చేయడం నచ్చలా. పైగా ఆ డిజాస్టర్ సినిమా డైరక్టర్ గురించి అలా మాట్లాడడం నచ్చలా. దాంతో ఇక ఈ నోటిదురద మీడియం డైరక్టర్ కు ఓ లెక్కలో క్లాస్ పీకేసాడట ఆ టాప్ హీరో. ఒక దశలో చుట్టూవున్నవారు, ఈ టాప్ హీరోకు వచ్చిన కోపం చూసి షాక్ అయినట్లు బోగట్టా. అంతా కలిసి కూల్ చేసి, ఆ డైరక్టర్ ను అక్కడి నుంచి పంపేసారు.

అదీ సంగతి. మెగా హీరోలతో నాలుగు సినిమాలు చేసిన ఆ డైరక్టర్ ఈ నొటి దురద కారణంగా చెడ్డ అవుతున్నారు. ఆ అలవాటు తగ్గించుకుని, ఇండస్ట్రీలో బతకనేర్చిన తనం ఎప్పుడు నేర్చుకుంటారొ?