వర్మ గారి ‘పైత్యం’

“పవన్ కళ్యాణ్ సినిమా, సంపూర్ణేష్ బాబు సినిమా ఈ ప్రభుత్వానికి ఒకటేనా?” Advertisement ఇదీ స్వయం ప్రకటిత మేధావి రామ్ గోపాల్ వర్మ గారు ప్రభుత్వానికి అడుగుతున్న ప్రశ్న. మరి గత ప్రభుత్వంలో పవన్…

“పవన్ కళ్యాణ్ సినిమా, సంపూర్ణేష్ బాబు సినిమా ఈ ప్రభుత్వానికి ఒకటేనా?”

ఇదీ స్వయం ప్రకటిత మేధావి రామ్ గోపాల్ వర్మ గారు ప్రభుత్వానికి అడుగుతున్న ప్రశ్న.

మరి గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ సినిమాకి, సంపూర్ణేష్ బాబు సినిమాకి యూనిఫార్మ్ గా 200 రూపాయలు టికెట్ పెట్టి అమ్మినపుడు ఈ ప్రశ్న సినీ జనాలకు గుర్తు రాలేదా??

అయినా పవన్ కళ్యాణ్ ని వేరు గా చూడడానికి ఆయనకేమైనా ప్రత్యేకంగా రెండు కొమ్ములు మొలిచాయా? పవన్ కళ్యాణ్ అనే కాదు. తెలుగు ఇండస్ట్రీ పెద్ద హీరోలందరికీ ఇదే వర్తింస్తుంది.

అయినా పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే టికెట్ రేట్ పెంచేయడానికి అనుమతి ఇచ్చేయాలా? బడ్జెట్ అనే దాని సంగతి అస్సలు పట్టించుకునే కూడదా?

ఏ కోటి రెండు కోట్లకో ఇతర భాషా సినిమాలు కొనేసి, ఒక ఐదు కోట్లు మిగతా నటీనటులకు ఇచ్చి, మొత్తం 10-15 కోట్లలో సినిమా చుట్టేసి హీరో గారికి మాత్రం ఒక యాభై కోట్లు సమర్పించేసుకుని, మాది 100 కోట్ల బడ్జెట్ సినిమా అయింది కనుక మా ఇష్టం వచ్చినట్లు టికెట్ రేట్లు పెంచేస్తాం అంటే ఒప్పుతుందా? అంత ఎక్కువ రేట్ కి టికెట్ కొని నాసి రకం సినిమా ప్రేక్షకుడు చూడాల్సివస్తుంది. మరి ఇది ప్రేక్షకుణ్ణి మోసం చేయడం కాదా?? అయినా ఈ రకం దిక్కుమాలిన మోసం ఒక్క మన టాలీవుడ్ లోనే జరుగుతుంది. మిగతా ఇండస్ట్రీలలో బడ్జెట్ బట్టి సినిమా లెక్కలు వేస్తారు. టికెట్ రేట్స్ కూడా దానికి అనుగుణంగానే ఉంటాయి.

ఉదాహరణకు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నే తీసుకుందాం. హయ్యెస్ట్ హిట్స్ తో ప్రస్తుతం దూసుకుపోతున్న హీరో అతడు. సంవత్సరానికి కనీసం మూడు-నాలుగు సినిమాలు తీసి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందులో హైయ్యెస్ట్ బడ్జెట్ సినిమాలు ఉంటున్నాయి. చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఉంటున్నాయి. రిలీజ్ కూడా వాటికి అనుగుణంగానే చేస్తున్నారు. అంతేగాని పెద్ద హీరో కనుక తక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు కూడా ఎక్కువ మొత్తానికి అమ్మి ఆ డబ్బుని ఎక్కువ టికెట్ రేట్స్ పెట్టి ప్రేక్షకుల దగ్గర వసూలు చేయడం లేదు అక్కడి నిర్మాతలు.

అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్, అతరంగీ రే చిన్న సినిమాలు. కనుక రెండూ OTT కి ఇచ్చేసారు. సూర్యవంశీ సినిమా పెద్ద బడ్జెట్ సినిమా కనుక రెండు సంవత్సరాలు ఆగి థియేటర్ లోనే రిలీజ్ చేశారు. టికెట్ ధరలు కూడా బడ్జెట్ కి అనుగుణంగా పెంచారు. అదీ పద్ధతి.

వర్మ గారి పద్ధతి ప్రకారం పెద్ద హీరో నటిస్తేనే పెద్ద బడ్జెట్ సినిమా అని లెక్కవేయాలేమో? గతంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో “దేవి” లాంటి సినిమాలు వచ్చాయి. హై టెక్నికల్ వాల్యూస్ తో గ్రాఫిక్స్ అందులో ఉన్నాయి. కానీ అందులో ముక్కు మొహం తెలియని హీరో ఉన్నాడు. కనుక వర్మ గారి లాజిక్ ప్రకారం ఆ సినిమాను సంపూర్ణేష్ బాబు సినిమాతో లెక్క కట్టాలేమో! ఇదెక్కడి లాజిక్కో వర్మ గారికి ఆయనను సమర్ధించే వారికే తెలియాలి.

సినిమా పై టికెట్ రేట్ తగ్గించే హక్కు ఎవరిచ్చారు అని వర్మ అడగడం హాస్యాస్పదం. టికెట్ రేట్స్ అన్ని రాష్ట్రాలలోనూ ప్రభుత్వాల అధీనంలోనే ఉంటాయి. గతంలో కర్ణాటక లో విచ్చలవిడిగా మిగతా భాషల సినిమాలకు టికెట్ రేట్ పెంచి, కన్నడ సినిమా లకు రేట్ తగ్గించి అమ్మినపుడు అక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకుని టికెట్ రేట్స్ సవరించింది. ఇప్పటికీ అవే అక్కడ అమలవుతున్నాయి. 

తమిళనాడు లో సినిమా టికెట్ ధర 125 కి అక్కడి ప్రభుత్వం cap పెట్టింది. ఇప్పటికీ మల్టీ ప్లెక్స్ కూడా అదే ధర ఫాలో అవుతున్నాయి. టికెట్ రేట్ పై మీ పెత్తనం ఏమిటని ఆయా రాష్ట్రాలలో ఎవరూ ప్రభుత్వాలని అడగలేదు. అంతెందుకు మొన్ననే తెలంగాణ ప్రభుత్వం అక్కడి సినిమా రేట్స్ ని బాగా పెంచింది. పెంచడానికి మీరెవరు అని వర్మ గారు వారిని అడగలేదు. అక్కడి ప్రభుత్వ నిర్ణయం వారికి అనుగుణంగా ఉండడం వలనేమో!

చిన్న సినిమాలకి కూడా హీరో పేరు చెప్పి ఇబ్బడిముబ్బడి గా దండుకోవడం తెలుగు నిర్మాతలు చేసిన పెద్ద తప్పు. దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు.  సమస్యని చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవడమే వారి ముందున్న ఏకైక మార్గం. అంతేగాని మాకు నచ్చినట్లు మేము టికెట్ రేట్స్ పెంచుకుంటాం అడగడానికి మీరెవరు లాంటి మాటలు ఆడితే వారి తోకలు కట్ చేయడానికి జగన్ వారి పైన ఎలాను ఉన్నాడు.

మీకు నచ్చినట్లు మీ ఇంట్లో ఉండండి వర్మ గారు. అది మీ ఇష్టం. మీ హక్కు. అంతేగాని పబ్లిక్ లోకి వచ్చి ప్రభుత్వ హక్కులను ప్రశ్నిస్తే ఊడిపోయిది మీ తొకే. ఇది కాస్త గుర్తెరిగి మాట్లాడండి.

భాస్కర్ కిల్లి