సినిమా వేదిక ల మీద రాఙకీయాలా?

సినిమా వేదికల మీద రాజ‌కీయాలు మాట్లాడడం సరి కాదని హీరో నాగార్జున‌ అభిప్రాయపడ్డారు. బంగార్రాజు డేట్ అనౌన్స్ మెంట్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వున్న టికెట్ రేట్ల కన్నా కాస్త ఎక్కువ…

సినిమా వేదికల మీద రాజ‌కీయాలు మాట్లాడడం సరి కాదని హీరో నాగార్జున‌ అభిప్రాయపడ్డారు. బంగార్రాజు డేట్ అనౌన్స్ మెంట్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వున్న టికెట్ రేట్ల కన్నా కాస్త ఎక్కువ వుంటే తమ సినిమాకు ఎక్కువ ఆదాయం వస్తుందని, లేకపోయినా తమ సినిమాకు క్లారిటీ ఇచ్చారు.

బంగార్రాజు పక్కా సంక్రాంతి సినిమా అని, అందుకే రేయింబవళ్లు ఆగకుండా పని చేసి జ‌నవరి 14న విడుదలకు వస్తున్నామన్నారు. ఒమిక్రాన్ సమస్యను, దాని వల్ల వచ్చే పరిణామాలను భగవంతుడికి వదిలేసి, సినిమా విడుదలకు డిసైడ్ అయ్యామన్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కలిసి మాంచి పాటలను తయారు చేసారన్నారు.

ఒక దశలో సినిమా కెరీర్ ను పక్కన పెట్టేద్దామా అనుకుంటే నాగార్జునే ధైర్యం చెప్పి, మళ్లీ ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అన్నారు. 

సోగ్గాడు చిన్న నాయనా షూటింగ్ టైమ్ లోనే సీక్వెల్ ఐడియా నాగార్ఙునకు వచ్చిందని, ఆ సినిమా హిట్ అయ్యాక చేయాలని ఫిక్స్ అయ్యామని ఆయన అన్నారు.