ఒకవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే చాలా జిల్లాలకు సంబంధించి ఎంపీటీసీ, జడ్పీటీసీల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఎంపీపీ, జడ్పీ చైర్మన్ పోస్టుల రిజర్వేషన్లు కూడా దాదాపు ఖరారు అయ్యాయి. వాటిని దక్కించుకోవడానికి ఆయా వర్గాల వాళ్లు పార్టీల తరఫున రెడీ అవుతూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు కూడా రంగం సిద్ధం అవుతూ ఉంది.
ఏపీలో మొత్తం 110 మున్సిపాల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దాదాపు రెండేళ్ల కిందటే ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అప్పట్లో చంద్రబాబు సర్కారు వీటిని నిర్వహించడానికి ముందుకు రాలేదు. ఇక వార్డుల పునర్విభజన కూడా దాదాపు పూర్తి అయినట్టుగా సమాచరాం. మరో నెల రోజుల్లో ఓటర్ల తుది జాబితా రానుందని, వచ్చే నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉండబోతోందని సమాచారం.
ఎంపీటీసీ, జడ్పీ ఎన్నికలు అలా ముగియగానే మున్సిపోల్స్ కు తెర లేవనుంది. మున్సిపల్ చైర్మన్ పీఠాలను సొంతం చేసుకోవడం ఏ పార్టీకి అయినా ప్రతిష్టాత్మకమే. ఈ నేపథ్యంలో ఏపీలో త్వరలో ఎన్నికల సందడి నెలకొననుంది.