Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కొరటాల కోసం 40 రోజులు

కొరటాల కోసం 40 రోజులు

టాప్ డైరక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడని ఎక్స్ క్లూజివ్ 'గ్రేట్ ఆంధ్ర' వెల్లడించిన సంగతి తెలిసిందే. చాలా మంది ఇతర మీడియా జనాలు అది కరెక్ట్ కాదని రాసుకున్న సంగతీ తెలిసిందే. అయితే లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, రామ్ చరణ్ 40 రోజుల కాల్ షీట్లు ఆ సినిమా కోసం కేటాయించినట్లు తెలుస్తోంది.

కొరటాల సినిమా కోసం రామ్ చరణ్ 40 రోజులు వర్క్ చేయాల్సి వుంది. ఆర్ఆర్ఆర్ తరువాత  ఆ మేరకు డేట్ లు ఇవ్వబోతున్నారు. రామ్ చరణ్ క్యారెక్టర్ ఏమిటన్నది ఇప్పటి వరకు తెలియలేదు కానీ, తొలిసారి కొరటాల ఓ ప్రయోగం చేయబోతున్నారు అన్నది వినికిడి. యంగ్ మెగాస్టార్ గా రామ్ చరణ్ కనిపిస్తారని తెలుస్తోంది.

పాత్ర ఏదయినా, ఈ సినిమా అయిన తరువాత వరకు మరో సినిమా రామ్ చరణ్ ఓకె చేయడం లేదని బోగట్టా. అలాగే ఆర్ఆర్ఆర్ పూర్తయి, విడుదల అయిన తరువాతనే కొరటా శివ సినిమా విడుదల చేయాలన్న ఓ జెంటిల్ మన్ అగ్రిమెంట్ కూడా వుందని తెలుస్తోంది. ఈ రెండు సినిమాల విడుదల తేదీల మధ్య  కాస్త గట్టి గ్యాప్ వుండేలా చూస్తారు.

నేనెప్పుడూ కోడి పందాలు చూడలేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?