రామ్ చరణ్ ఫిలాసఫీ ఇది

ప్రతిది ఓ పాఠమే. ప్రతి సందర్భం ఓ పాఠమే. ప్రారంభంలో నేను కూడా తప్పులు చేశాను. ఆ తప్పుల నుంచి నేర్చుకున్నాను.

ఫిలాసఫీ పాఠాలు చెప్పమంటే టాలీవుడ్ హీరోల్లో వెంకటేష్ ముందుంటారు. అయితే ప్రతి హీరోకు ఓ ఫిలాసఫీ ఉంటుంది. రామ్ చరణ్ కు కూడా అలాంటి లైఫ్ ఫిలాసఫీ ఒకటి ఉంది. ఇంతకీ రామ్ చరణ్ నమ్మేదేంటి.. ఆయన ఫాలో అయ్యేదేంటి?

– ప్రతిది ఓ పాఠమే. ప్రతి సందర్భం ఓ పాఠమే. ప్రారంభంలో నేను కూడా తప్పులు చేశాను. ఆ తప్పుల నుంచి నేర్చుకున్నాను. చేసిన తప్పులు రిపీట్ చేయకుండా ఉంటే చాలు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది.

– ప్రతి దానికి సమాధానం ఇవ్వడానికి తాపత్రయపడకూడదు. మన టైమ్ వస్తుంది. ప్రతి సంవత్సరం మనది కాదు, ప్రతి వారం మనది కాదు. కొన్ని సార్లు అద్భుతంగా ఉంటుంది, కొన్నిసార్లు ఫ్లాప్ తప్పదనే విషయాన్ని మనం అంగీకరించాలి.

– ప్రతి మనిషికి లో-పాయింట్ వస్తుంది. నాక్కూడా వచ్చింది. మనం డౌన్ లో ఉన్నామనే విషయాన్ని ముందు అంగీకరించాలి. వాస్తవంలో బ్రతకాలి. ఓ సినిమా ఫ్లాప్ అయినప్పుడు లేదా కుటుంబంలో ఏదైనా ప్రతికూలంగా జరిగినప్పుడు బాధపడ్డానికి కూడా టైమ్ ఇవ్వాలి. ఎందుకంటే, ఆ బాధ నుంచే సమాధానాలు, పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అలా అని కుమిలిపోయే తత్వం కాదు నాది, సమస్యను ఎలా పరిష్కరించాలనే కోణంలోకి వెళ్లిపోతాను.

ఇదీ రామ్ చరణ్ ఫిలాసఫీ. చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటూనే… పెద్దల మాట వినడం, వాళ్ల అనుభవాల నుంచి నేర్చుకోవడం ద్వారా, మరిన్ని తప్పులు చేయకుండా ముందుగానే జాగ్రత్తపడొచ్చని చెబుతున్నాడు చరణ్.

13 Replies to “రామ్ చరణ్ ఫిలాసఫీ ఇది”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. Hero లకి especially నెపో లకి పెద్ద డ్యామేజ్ ఉండదు .నాలుగు రోజుల్లో అంత మార్చి పోతారు . కానీ నిర్మాత లకే శాశ్వత మయిన నష్టం. హీరోయిన్ హీరో లకు ఏమి పోయింది ? దిల్ రాజు కి 200 కోట్లు నికరంగా పోతాయి గేమ్ చెంజర్ వల్ల

  3. చివరగా, గేమ్ ఛేంజర్ మూవీ హిట్ లేదా ఫ్లాప్? వేదాలు బోధించకండి, విషయానికి రండి
  4. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు,

Comments are closed.