క్లారిటీ కోసం మరో వీడియో రిలీజ్

ఎంత కష్టపడి నటించినా డూప్ వాడారని లేదా గ్రాఫిక్స్ ఉపయోగించారనే అనుమానాలు వ్యక్తం అవుతుంటాయి.

బహుశా పెద్ద హీరోల సినిమాలకు ఈ బాధ తప్పదేమో. ఎంత కష్టపడి నటించినా డూప్ వాడారని లేదా గ్రాఫిక్స్ ఉపయోగించారనే అనుమానాలు వ్యక్తం అవుతుంటాయి. రజనీకాంత్ విషయంలో కూడా ఇదే జరిగింది.

రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో జైలర్-2 సినిమాను గ్రాండ్ గా ప్రకటించారు. ఎంత గ్రాండ్ గా అంటే, ఈ ప్రకటన కోసం ఓ వీడియోను షూట్ చేశారు. టీజర్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న ఆ వీడియోలో రజనీకాంత్ ను చూపించారు.

అయితే చాలామంది ఈ వీడియోపై అనుమానం వ్యక్తం చేశారు. వీడియోలో చివరి సీన్‌లో మాత్రమే రజనీ ఒరిజినల్‌గా కనిపించారని, మిగతా సన్నివేశాలన్నీ మేనేజ్ చేశారంటూ కొందరు ఇంటర్నెట్‌లో పుకార్లు పుట్టించారు.

దీంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ, ఈ పుకార్లకు తమదైన శైలిలో స్పందించింది. జైలర్-2 ఎనౌన్స్ మెంట్ వీడియోకు చెందిన మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ మేకింగ్ వీడియోలో రజనీకాంత్ స్పష్టంగా కనిపిస్తున్నారు. ఆయనకు చెందిన సన్నివేశాల్లో ఆయనే నటించినట్టు మేకింగ్ వీడియో చూస్తే అర్థమౌతోంది.

దీంతో జైలర్-2 ఎనౌన్స్ మెంట్ వీడియోపై వస్తున్న అనుమానాలు, ఊహాగానాలకు చెక్ పడినట్టయింది. నిజానికి ఇక్కడ మరో హీరో ఉన్నట్టయితే ఈ అనుమానాలు ఉండేవి కావు, 74 ఏళ్ల రజనీకాంత్ కేవలం ఎనౌన్స్ మెంట్ వీడియో కోసం సెట్స్ కి వచ్చారంటే చాలామంది నమ్మలేకపోయారు. అలాంటి వాళ్లకు పూర్తి క్లారిటీ ఇచ్చేందుకు మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

3 Replies to “క్లారిటీ కోసం మరో వీడియో రిలీజ్”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.