డాకూ మహారాజ్ మాత్రమే కాదు, పండగ సినిమాల విడుదల నాటికి కొన్ని రోజులు ముందే గ్రేట్ ఆంధ్ర ఓ కథనం ప్రచురించింది. ఈ ముక్కోణపు పోటీలో డాకూ మహారాజ్‌కి థియేటర్లు తక్కువగా దొరికే అవకాశం ఉందని. ఎందుకంటే, మూడు సినిమాలు నైజాంలో విడుదల చేసేది ఒకరే అయినా, నైజాంలో ఆసియన్ సురేష్‌కి అధిక థియేటర్లు ఉన్నాయి. అందులో హీరో వెంకటేష్ భాగస్వామి. అలాగే గేమ్ ఛేంజర్ అనేది నైజాంలో మూడు సినిమాలు విడుదల చేసే దిల్ రాజు ప్రెస్టీజియస్ మూవీ. దీని వల్ల థియేటర్ల పంపిణీ అంత సమానంగా జరగకపోవచ్చు అనే అనుమానం అప్పట్లో ట్రేడ్ వర్గాల్లో వినిపించింది. అదే కథనంగా మారింది.
కట్ చేస్తే, విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం, డాకూ మహారాజ్ హీరో నందమూరి బాలకృష్ణ నైజాంలో తన సినిమా ప్రాపర్‌గా విడుదల కాలేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు 180 స్క్రీన్లలో మాత్రమే డాకూ మహారాజ్ నైజాంలో విడుదలైంది. ఇదే సంస్థ గతంలో నిర్మించిన గుంటూరు కారం 250కి పైగా స్క్రీన్లలో విడుదలైంది. అప్పుడు కూడా వెంకీ సైంధవ్, హనుమాన్ పోటీ ఉన్నాయి. అలాగే, గత బాలయ్య సినిమా భగవంత్ కేసరికి చాలా ఎక్కువ థియేటర్లు దొరికాయి.
డాకూ మహారాజ్ ఇప్పటివరకు నైజాంలో 10 కోట్లకు కాస్త అటు ఇటుగా కలెక్ట్ చేసింది. లాంగ్ రన్‌లో ఇది 13 నుంచి 15 కోట్ల మధ్య సెటిల్ కావచ్చు. భగవంత్ కేసరి టోటల్ రన్‌లో నైజాంలో 15 కోట్ల వరకు కలెక్ట్ చేసింది, అది కూడా వితౌట్ జీఎస్టీ. డాకూ మహారాజ్‌కి సరైన థియేటర్లు, సరిపడా స్క్రీన్లు దొరికివుంటే, మరో రెండు కోట్లు ఓపెనింగ్స్‌లో వచ్చేవని బాలయ్య సన్నిహితులు భావిస్తున్నారని బోగట్టా. భగవంత్ కేసరిను మించే నెంబర్లు కనిపించేవని వారు లెక్కలు వేస్తున్నారు.
గమ్మత్తేమిటంటే, నైజాం పంపిణీ చేసిన దిల్ రాజు వైజాగ్ ఏరియాలో డాకూ మహారాజ్ విడుదల చేయలేదు. అక్కడ పూర్వీ వీర్రాజు విడుదల చేశారు. వైజాగ్‌లో డాకూ మహారాజ్‌కి మంచి రిలీజ్ దొరికింది. ఇది కూడా నైజాంలో అసంతృప్తికి దారితీసినట్లు తెలుస్తోంది.
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
సితారా వంశీ, దిల్ రాజు పారిపోయి dakkondi. ప్రమాణ పత్రం ఉంది. No casexs.
దేనికి వసూళ్లు బట్టి ఎక్కు వ డిమాండ్ చేయాడం కోసమే నా..NM
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు