కన్నప్ప చిత్రానికి ప్రమోషన్స్ లో మంచు విష్ణు మహా బిజీగా ఉన్నారేమో. నిర్మాతగా ఆయన మేకింగ్ పనులు, ఇప్పుడు ప్రమోషన్ పనులు కూడా చూసుకోవాలి. బెంగుళూరులో లేటెస్ట్ గా ప్రెస్ మీట్ పెట్టిన విష్ణు కన్నప్ప గురించి అనేక షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఏప్రిల్ 25న రాబోయే కన్నప్ప చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు.. ‘కన్నప్ప అంటే ఇదా.. కన్నప్ప ఇలా ఉంటాడా..’ అని షాక్ కు గురికాక తప్పదేమో అని విష్ణు చెబుతున్న విషయాలను బట్టి అర్థం అవుతోంది. అందుకే అప్పుడు సినిమా మరియు దాని కథయొక్క క్వాలిటీ గురించి ఎవ్వరూ ప్రశ్నలు లేవనెత్తకుండా మంచు విష్ణు డిస్‌క్లెయిమర్ ప్రకటించేస్తున్నారు.
కన్నప్ప చిత్రం షూటింగ్ ను న్యూజీలాండ్ అడవుల్లో ప్లాన్ చేసినప్పుడు సినీలోకం నివ్వెరపోయింది. రాజంపేట నుంచి కాళహస్తీశ్వరుడు వెలిసిన అడవులకు విస్తరించిన అడవుల్లో తిరిగిన ఆటవికుడు కన్నప్పకు న్యూజీలాండ్ అడవుల బ్యాక్ గ్రౌండ్ సెట్ చేయడం అనేది అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆ తర్వాత స్టిల్స్ విడుదల అవుతున్న కొద్దీ.. ఆయుధాలు గట్రా చూస్తున్న కొద్దీ.. ఇది ఆటవికుడు కన్నప్ప కథేనా.. పేరుమాత్రం కన్నప్ప అని పెట్టుకున్న ఒక వీర యోధుడి చరిత్ర అవుతుందా అని కూడా అందరూ ఆశ్చర్యపోతూ వచ్చారు. అలాంటి వారికి మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు.
గతంలో కృష్ణం రాజు హీరోగా వచ్చిన కన్నప్ప చిత్రానికి తమ చిత్రానికి చాలా తేడా ఉందని విష్ణు చెప్పుకొచ్చారు. మరొక వైపు ఆయన కన్నప్పను ఇప్పుడు రీమేక్ చేస్తున్నాం అని అంటున్నారు. అదే సమయంలో.. ఆనాటి కన్నప్ప.. నేను తీస్తున్న కన్నప్ప సేమ్ స్టోరీ కాదు అని కూడా అంటున్నారు. మళ్లీ కన్నప్ప కథను నా పంథాలో చెబుతున్నాను.. అంటున్నారు.
ఇలా నాలుగు మాటలు మాట్లాడితే.. నాలుగు మాటల మధ్య ఏమాత్రం పొంతన లేకుండా మంచు విష్ణు తన సినిమా గురించి విచిత్రమైన క్లారిటీ ఇవ్వడం ఇక్కడ గమనించాలి.
మంచు విష్ణు.. ‘కన్నప్ప గురించి ఇప్పటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది’ అని కూడా అంటున్నారు. విష్ణుకు ఎలా నచ్చితే అలా కన్నప్ప చరిత్రను మార్చేసుకుని.. ‘ఇది నా పంథాలో చెప్పడం’ అని ఒక అందమైన ముసుగు తొడిగి ఒక కంగాళీ వంటకాన్ని వండి వెండితెర మీద వారిస్తే ఎవ్వరికీ ఏ అభ్యంతరమూ లేదు.
కానీ.. ఇది కన్నప్ప కథే.. కన్నప్ప గురించి యువతరం తెలుసుకోవాలి.. లాంటి బిల్డప్పులు ఎందుకు? ఇదంతా కన్నప్ప ముసుగులో యువతరాన్ని తప్పుదారి పట్టించడం అవుతుంది కదా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు.
Adi Bhktha Kannappa. Idi Katthi Kannappa ayyundochhu.
సుత్తి కన్నప్ప కూడా ఐవుండచ్చు
సినిమా లో కన్నప్ప కు.. నత్తి లేకపోతే సరి!
Evaru cheyalsina characters vallu cheyali. Vishnu ki kannappa character ela suit avutundi anukunnado. Aayana zonar kadu. Evo comedy touch cinemalu teesukokunda dabbu waste chesukuntunnadu. Kamadhenu lanti university undabatti Manchu family survive avutundi ledante eppudo bichana ethesevallu.
Evaru cheyalsina characters vallu cheyali. Vishnu ki kannappa character ela suit avutundi anukunnado. Aayana zonar kadu. Evo comedy touch cinemalu teesukokunda dabbu waste chesukuntunnadu. Kamadhenu lanti university undabatti Manchu family survive avutundi ledante eppudo bichana ethesevallu.
both are not same
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
అది బాపు kannappa ఇది “ముంచు” kannappa. తేడా నే కదా!
ఈ సినిమా చాలా అంటే చాలా క్రొత్తగా ఉంటుంది, కాని ఇంతకు ముందు చాలా సార్లు చూసేసాం ఇలాంటివి
ఇదొక భక్తుడి కథ కాని టూ ముచ్ ఏక్షన్ ఉంటుంది, ఫైట్స్ అన్నీ క్రొత్తగా ఉంటాయి
చిన్న పిల్లలతో కలిసి చూడదగ్గ ఫేమిలీ సినిమా, సెన్సార్ A సర్టిఫికేట్ ఇచ్చినా మాకు OK
Orey vp kannappa nee baabu cinemaa laage nee cinema kooda 1 show nea
Madhyamadhyalo shivaleela, shivudi aagna and shivayyaaa alanti words kooda vunnayi kada ee daridrudi speechlo