డాకూ కు నైజాంలో థియేటర్ల సమస్య?

ఇక్కడ సమస్య ఏమిటంటే దిల్ రాజుకు అన్ని విధాలా గేమ్ ఛేంజర్ కీలకం. అదే సమయంలో ఆసియన్ సురేష్‌కు సంక్రాంతికి వస్తున్నాం కీలకం. మధ్యలో అటు ఇటు కానిది డాకూ మహరాజ్.

డాకూ మహరాజ్ పెద్ద సినిమా. పెద్ద బ్యానర్. పెద్ద పంపిణీదారు. పాపులర్ హీరో. అందువల్ల ఇంకా థియేటర్ల సమస్య ఏమిటి? అనుకోవచ్చు. కానీ సినిమా ఏది అయినా సంక్రాంతి అంటే ఏదో ఒక సినిమా థియేటర్ల కోసం ఇబ్బంది పడక తప్పదు. అందులోనూ ముఖ్యంగా నైజాంలో. ఈ సారి మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి. సంక్రాంతి సీజన్‌కు మూడు సినిమాలు నడుస్తాయి. పెద్దగా ఇబ్బంది లేదు. కానీ అయినా కూడా థియేటర్లకు సమస్య వచ్చేలా ఉంది. ఎందుకు.. ఎలా? చూద్దాం.

నైజాంలో మూడు సినిమాల పంపిణీదారు ఒకరే దిల్ రాజు. మూడు సినిమాల్లో రెండు సినిమాల నిర్మాత కూడా ఒకరే దిల్ రాజు. నైజాంలో 150 థియేటర్ల వరకు ఆసియన్ సురేష్ చేతిలో ఉన్నాయి. అంటే సురేష్ బాబు భాగస్వామ్యం. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హీరో సురేష్ బాబు సోదరుడు వెంకటేష్. అందువల్ల వాళ్ల థియేటర్లలో వాళ్లకు ప్రాధాన్యం తప్పదు.

ఇప్పుడు ముందుగా 10న గేమ్ ఛేంజర్ వస్తుంది. ఈ అన్ని థియేటర్లలో ఆ సినిమా ఉంటుంది. 12న డాకూ మహరాజ్ వస్తుంది. కొన్ని థియేటర్లు తీసి దానికి ఇస్తారు. ఎన్ని తీస్తారు అన్నది టాక్‌ను బట్టి ఉంటుంది కొంత వరకు. ఇలా తీసిన థియేటర్లలో మళ్లీ 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఇవ్వాలి.

ఇక్కడ సమస్య ఏమిటంటే దిల్ రాజుకు అన్ని విధాలా గేమ్ ఛేంజర్ కీలకం. అదే సమయంలో ఆసియన్ సురేష్‌కు సంక్రాంతికి వస్తున్నాం కీలకం. మధ్యలో అటు ఇటు కానిది డాకూ మహరాజ్. పైగా నైజాంలో బాలయ్య మార్కెట్ కాస్త తక్కువ. అందువల్ల అటు ఇటు చేసి డాకూ మహరాజ్ సినిమా థియేటర్ల కోసం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది.

14 Replies to “డాకూ కు నైజాంలో థియేటర్ల సమస్య?”

  1. డ్యాన్స్ ల్లో హాలీవుడ్ లెవెల్ కి రీచ్ అయిన మూవీ కి… థియేటర్ల సమస్య ఏంటి సామీ??

  2. డ్యాన్స్ ల్లో హాలీ వుడ్ లెవెల్ కి చేరుకున్న మూవీ కి థియేటర్ల సమస్య ఏంటి సామీ???

  3. డాకు సినిమా ఫస్సాక్.. గేమ్ చేంజర్ తుపుక్.. సంక్రాంతికి వస్తున్నాం సైలెంట్ కిల్లర్

  4. తెలంగాణా లో బాలయ్య మార్కెట్ ఏంటో అఖండ,వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి నిరూపించంచాయి.

  5. ఇవన్నీ తర్వాత కానీ,ముందు దండ్యుపలేము ముఠా కి తగ్గని రీతిలో

    మాజీ సిఎం, అవినీతి కేసు*ల్లో బెయిల్ మీద వున్న జగన్ తమ్ముడు, భారతి గారి pa కలిసి స్థలాలు ప్రభుత్వ అధికారిని బెదిరించి స్థలాలు కాజేశారు ఆన్న సంగతి గురించి ఏమిటి, కిక్కురు మనడం లేదు?

    వైఎస్ సునీల్ కి గ్రేట్ ఆంద్ర లో వాటా ఏమన్నా ఉందా?

  6. “బాలా”గురిపెడితే,బాక్స్ ఆపీస్ షేక్ అవాల్సిందే.

    ఆడబ్బ ఎవడైనా,మాస్ రికార్డ్ కి తలవంచాల్సిందే

Comments are closed.