బన్నీ తొలి ఆదివారం ఇలా గడిచింది!

ఈరోజు నుంచి ప్రతి ఆదివారం బన్నీకి సండే వస్తే, ఎక్స్ ట్రా డ్యూటీ ఒకటి పడింది. అదే పోలీస్ స్టేషన్ దర్శనం.

ఆదివారాలు అందరికీ ఒకటే. సండే వస్తే రెస్ట్ తీసుకోవడానికి, కుటుంబంతో గడపడానికి ఎవరైనా ప్రాధాన్యం ఇస్తారు. స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా దీనికి అతీతం కాదు. అయితే ఈరోజు నుంచి ప్రతి ఆదివారం బన్నీకి సండే వస్తే, ఎక్స్ ట్రా డ్యూటీ ఒకటి పడింది. అదే పోలీస్ స్టేషన్ దర్శనం.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు, అందులో అల్లు అర్జున్ ను కూడా నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తాజాగా నాంపల్లి కోర్టు నుంచి బెయిల్ పొందాడు బన్నీ.

బెయిల్ అయితే వచ్చింది కానీ, కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా. ఆ షరతుల ప్రకారం ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వ్యక్తిగతంగా హాజరై సంతకం పెట్టి రావాలి అల్లు అర్జున్. ఆ కార్యక్రమం ఇవాళ్టి నుంచి మొదలైంది.

ఈరోజు ఉదయం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయ్యాడు అల్లు అర్జున్. పోలీస్ రిజిస్టర్ లో సంతకం పెట్టారు. అన్ని ఫార్మాలిటీస్ 10 నిమిషాల్లో పూర్తిచేసి తిరిగెళ్లిపోయారు. కొన్నాళ్ల పాటు, ఇకపై ప్రతి ఆదివారం అల్లు అర్జున్ కు ఇది తప్పదు. ఇకపై ఆదివారం ఆయన హైదరాబాద్ దాటి బయటకెళ్లలేరు. ఏం చేసినా సంతకం పెట్టిన తర్వాతే.

బన్నీకి మరో నోటీసు…

మరోవైపు ఊహించని విధంగా మరో నోటీసు అందుకున్నాడు అల్లు అర్జున్. ఈసారి హైదరాబాద్ లోని రాంగోపాల్ పేట్ పోలీసులు బన్నీకి నోటీసులిచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడికి చికిత్స జరుగుతోంది.

బాలుడ్ని పరామర్శించేందుకు అల్లు అర్జున్ ఈరోజు హాస్పిటల్ కు వస్తారనే ప్రచారం జరిగింది. దీంతో ఆ హాస్పిటల్ పరిధికి చెందిన రాంగోపాల్ పేట్ పోలీసులు, అల్లు అర్జున్ కు నోటీసులిచ్చారు. పరామర్శకు వస్తే తమ సూచనలు పాటించాలని, ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి వస్తుందని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు.

10 Replies to “బన్నీ తొలి ఆదివారం ఇలా గడిచింది!”

  1. ఎప్పుడైతే అల్లు అర్జున్ ని జగన్ రెడ్డి ఫాన్స్ మోయడం మొదలు పెట్టారో.. అప్పటి నుండే అల్లు అర్జున్ నెత్తిన దరిద్రం ఎక్కి కూర్చుంది..

    పాపం.. ఇప్పుడు జగన్ రెడ్డి లాగా ప్రతి వారం స్టేషన్ కి వెళ్లి సంతకం చేయాల్సిన ఖర్మ పట్టింది..

      1. కేసుల విచారణ ఇంకా మొదలవ్వలేదు.. మొదలవగానే ప్రతి రోజూ వెళ్లాల్సి ఉంటుంది..

        లా చట్టాల్లో లొసుగులు జగన్ రెడ్డి కి తెలిసినంతగా మరెవరికీ తెలీదు.. ఎగ్గొట్టే మార్గాలు వెతుక్కొంటుంటాడు..

  2. పాపం GA…20 yrs కష్టపడి ఇప్పటికి career peak కి వచ్చాడు…..కేవలం మీ పార్టీ వాళ్ళతో చెడు సావాసం వల్ల మొత్తం నాశనం చేసుకున్నాడు ….so sad

Comments are closed.