విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ తెలిసింది.
ఈ సినిమా నుంచి ‘జరగండి’ అనే సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే. సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్ వీడియో అదే. ఆ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించాడు. మరి ఈ పాటకు డాన్స్ కంపోజ్ చేసినందుకు ప్రభుదేవా ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా?
‘జరగండి’ సాంగ్ కు వర్క్ చేసినందుకు ప్రభుదేవా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంట. స్వయంగా దర్శకుడు శంకర్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఈ పాటకు ప్రభుదేవా ఫ్రీగా పనిచేశాడంట.
చిరంజీవి అంటే ప్రభుదేవాకు చాలా ఇష్టం. చిరంజీవి సినిమాలకు కొరియోగ్రఫీ చేయడమే కాదు, దర్శకుడిగా మారి చిరంజీవిని డైరక్ట్ చేశాడు కూడా. ఆ ఇష్టం, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ పైకి కూడా మళ్లింది.
అందుకే రామ్ చరణ్ పై ఇష్టంతో ‘జరగండి’ సాంగ్ కు ఫ్రీగా వర్క్ చేశాడట ప్రభుదేవా. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. రామ్ చరణ్ అంటే ఎంతిష్టమో, దిల్ రాజు అంటే అంత గౌరవం కూడానట. గేమ్ ఛేంజర్ కు ప్రభుదేవా ఉచితంగా సేవలందించడానికి ఇది కూడా ఓ కారణమంట.