‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఎస్ జే సూర్యను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు పవన్ కల్యాణ్. అంతేకాదు, చిన్న కామెంట్ కూడా చేశారు. ఎస్ జే సూర్య లాంటి దర్శకుడు డైరక్షన్ నుంచి తప్పుకొని నటన వైపు రావడం తనకు నచ్చలేదని, ఆయన మళ్లీ సినిమాలు డైరక్ట్ చేయాలని అన్నారు.
అలా నిండు సభలో పవన్ కల్యాణ్ చెప్పినప్పటికీ, ఎస్ జే సూర్య మాత్రం ‘నో డైరక్షన్’ అంటున్నాడు. ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్ లో భాగంగా ఈరోజు మీడియాతో మాట్లాడిన ఎస్ జే సూర్య.. ఇప్పట్లో డైరక్ట్ చేసే ఆలోచన లేదని తెగేసి చెప్పేశాడు.
“నాకు నటుడిగా చాలా కంఫర్ట్ గా ఉంది. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు.” అంటూ కరాఖండిగా చెప్పేశాడు. ఇదే దర్శకుడు జస్ట్ కొన్ని నెలల కిందట పవన్ మరోసారి ఛాన్స్ ఇస్తే డైరక్షన్ చేస్తానన్నాడు.
ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాడు. ఒకవేళ పవన్ తో కుదరకపోతే, ఆయన కొడుకు అకిరా నందన్ తో ఖుషి సినిమాకు సీక్వెల్ చేస్తానంటున్నాడు.
“రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరా నందన్‌ను ఫ్లైట్‌లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. పవన్ కళ్యాణ్ లానే అప్పుడే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు. ఒకవేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే.. టైం కలిసి వస్తే.. ఖుషి-2 డైరక్ట్ చేస్తానేమో చూడాలి.”
గేమ్ ఛేంజర్ లో పోషించిన నెగెటివ్ పొలిటీషియన్ పాత్ర ఎస్ జే సూర్యకు చాలా బాగా నచ్చిందంట. ఎంతలా నచ్చిందంటే, తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా 3 భాషల్లో తనే సొంతంగా డబ్బింగ్ చెప్పాడంట.
He knows his talent in direction….😭